Site icon vidhaatha

Om Raut | ‘దేవుడు హనుమాన్ చెవిటివాడా?’.. వైర‌ల్‌గా మారిన ఓం రౌత్ పాత ట్వీట్

Om Raut |

ప్ర‌భాస్‌, కృతిస‌న‌న్ జంట‌గా ఓం రౌత్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఆదిపురుష్ సినిమాను వ‌రుస వివాదాలు చుట్టుముడుతున్నాయి. దర్శకుడు ఓం రౌత్ హనుమాన్ జయంతికి సంబంధించిన గ‌తంలో పెట్టి తొల‌గించిన ఒక ట్వీట్‌ను ప‌ట్టుకుని ఇప్పుడు నెటిజ‌న్లు ఒక ఆట ఆడుకుంటున్నారు.

ఓం రౌత్ దర్శకత్వం వహించిన, పౌరాణిక నాటకం ఆదిపురుష్ ఈనెల‌ 16న థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రంలో ప్రభాస్ రాఘవ (రాముడు), కృతి సనన్ జానకి (సీత), సైఫ్ అలీ ఖాన్ లంకేష్ (రావణ)గా నటించారు. ఈ చిత్రంపై మొద‌టి షో నుంచే విమ‌ర్శ‌ల దాడి మొద‌ల‌యింది. ముఖ్యంగా రాణ‌వుడి వేష‌దార‌ణ‌, ప్ర‌వ‌ర్త‌న‌పై నెటిజ‌న్లు, రామ‌భ‌క్తులు తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేశారు.

2015లో ఓం రౌత్‌ “దేవుడు హనుమాన్ చెవిటివాడా? నా ఇంటి చుట్టూ ఉన్నవారు అలా అనుకుంటున్నారు. హనుమాన్ జయంతి రోజున ‘చెవులు ప‌గిలిపోయేలా పాట‌లు’ పెడుతున్నారు. అవి కూడా హ‌నుమంతుడికి అస‌లు సంబంధంలేనివి” అంటూ చేసిన ట్వీట్ ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది.

కొంద‌రు ఆ తొల‌గించిన ట్వీట్‌ను ప‌ట్టుకుని ఓం రౌత్‌ను ‘డోగ్లా’ (రెండు ముఖాలు) అని పిలుస్తున్నారు.
ఓం రౌత్ ఆదిపురుష్ విడుదలకు ముందు ప్రతి స్క్రీనింగ్‌లో హనుమంతుని కోసం ఒక సీటును రిజర్వ్ చేస్తానని ప్రకటించిన ఓం రౌత్ వీడియోను పాత ట్వీట్‌తో పాటు షేర్ చేసి మ‌రీ ఆట ఆడుకుంటున్నారు.

“భాయ్ క్యా దోగాలా అద్మీ హై యే (అతను అంత రెండు ముఖాల వ్యక్తి) , అంటూ హ్యాష్‌టాగ్ చేస్తున్నారు. కొంద‌రైతే డైరెక్టర్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తానని బెదిరిస్తున్నారు. మ‌రికొంద‌రు రాముడిలా చేసిన ప్ర‌భాస్ జీస‌స్ పోలిక‌ల‌తో ఉన్నార‌ని ట్రోల్ చేస్తున్నారు.

Exit mobile version