Warangal | వర్షాలతో ఇల్లు కూలి ఒకరు మృతి

Warangal వరంగల్ పైడిపల్లిలో సంఘటన విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షానికి వరంగల్ నగర పరిధిలోని పైడిపెల్లిలో పాత ఇల్లు కూలి ఒకరి మృతి చెందారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. రెండు రోజుల నుంచి వరుసగా కురుస్తున్న ముసురుతో పైడిపల్లి గ్రామంలో పాత ఇల్లు నానిపోయి బుధవారం తెల్లవారుజామున కూలిపోయింది. నిద్రలో ఉన్న విజయ్‌కుమార్ అనే వ్యక్తి కూలిన గోడలు మీద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ […]

  • Publish Date - July 19, 2023 / 01:32 AM IST

Warangal

  • వరంగల్ పైడిపల్లిలో సంఘటన

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షానికి వరంగల్ నగర పరిధిలోని పైడిపెల్లిలో పాత ఇల్లు కూలి ఒకరి మృతి చెందారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. రెండు రోజుల నుంచి వరుసగా కురుస్తున్న ముసురుతో పైడిపల్లి గ్రామంలో పాత ఇల్లు నానిపోయి బుధవారం తెల్లవారుజామున కూలిపోయింది. నిద్రలో ఉన్న విజయ్‌కుమార్ అనే వ్యక్తి కూలిన గోడలు మీద పడి అక్కడికక్కడే మృతి చెందాడు.

ఈ సంఘటన సమాచారం తెలుసు మునిసిపల్ కార్పొరేషన్ సిబ్బంది,ఎన్డీఆర్‌ఎఫ్ బృందం రంగం లోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. శిథిలావస్థలో ఉన్న పాత భవనాలను స్వచ్ఛందంగా తొలగించుకోవాలని ఇప్పటికే మున్సిపల్ కార్పోరేషన్ అధికారులు పలుమార్లు విన్నవించిన విషయం తెలిసిందే.