Site icon vidhaatha

Chat GPT APP | గూగుల్‌ ప్లే స్టోర్‌లో చాట్‌ జీపీటీ.. ఎలా డౌన్‌లోడ్‌ చేసుకోవాలో తెలుసా..?

ChatGPT APP |

కృత్రిమ మేథ (AI) ఆధారిత చాట్ బాట్ ‘చాట్ జీపీటీ’ (ChatGPT) గూగుల్‌ ప్లే స్టోర్‌లో అందుబాటులోకి వచ్చింది. భారత్‌తో పాటు పలు దేశాలకు చెందిన యూజర్లకు మాత్రమే కంపెనీ అందుబాటులో ఉంచింది. ఆండ్రాయిడ్ యూజర్లు తమ ఫోన్లలో చాట్‌ జీపీటీని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఏఐ ఆధారిత చాట్‌ జీపీటీ సంచలనం సృష్టించింది.

విప్లవాత్మక టెక్ ఆవిష్కరణ చాట్ జీపీటీ. ఈ చాట్ జీపీటీ వ్యక్తుల దైనందిన, వృత్తిగత, ప్రవృత్తిగత కార్యకలాపాలను మరింత సులభతరం చేస్తున్నది. ఉద్యోగులకు, విద్యార్థులకు, కళాకారులు సహా ప్రతి ఒక్కరికీ టెక్‌ నేస్తంగా మారింది.

2022 నవంబర్‌లో అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో సామ్ ఆల్టమన్‌కు చెందిన ఓపెన్ఏఐ (OpenAI) చాట్ జీపీటీ (ChatGPT)ని ఆవిష్కరించింది. ప్రారంభం నుంచే ఈ ఏఐ టెక్నాలజీ సంచనాలకు వేదికగా మారింది. కొద్ది రోజుల్లోనే ఎంత పాపుల్‌ అయ్యిందంటే.. దీన్ని తట్టుకోలేక మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌ వంటి దిగ్గజ టెక్‌ కంపెనీలు సైతం సొంతంగా ఏఐ టెక్నాలజీని ప్రారంభించాల్సిన పరిస్థితి ఎదురైంది.

ఇకపై గూగుల్ ప్లే స్టోర్‌లో..

తాజాగా చాట్ జీపీటీని ఓపెన్‌ ఐ కంపెనీ గూగుల్ ప్లే స్టోర్ అందుబాటులోకి తీసుకువచ్చింది. తొలుత అమెరికా, భారత్‌, బంగ్లాదేశ్, బ్రెజిల్ దేశాల్లో అందుబాటులో ఉంటుందని ఓపెన్ ఐఏ సంస్థ వెల్లడించింది. ఆయా దేశాల్లోని స్మార్ట్ ఫోన్ యూజర్లు తమ ఫోన్లలో ఈ ఓపెన్ ఏఐ చాట్ జీపీటీని ఇన్‌స్టాల్‌ చేసుకోవచ్చు. దశల వారీగా ఇతర దేశాల్లోనూ ఆండ్రాయిడ్ చాట్ జీపీటీ వెర్షన్‌ను అందుబాటులోకి తేనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ ఏడాది మేలో ఐఫోన్లలో ఈ సదుపాయాన్ని తీసుకువచ్చింది.

ఎలా డౌన్‌లోడ్‌ చేయాలంటే..?

ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు పలు దేశాల్లోని యూజర్లకు మాత్రమే చాట్ జీపీటీ అందుబాటులో ఉంది. తాజాగా అమెరికా, భారత్‌, బంగ్లాదేశ్, బ్రెజిల్ దేశాల్లోని యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. ఆండ్రాయిడ్ ఫోన్లలో ఈ చాట్ జీపీటీని డౌన్‌లోడ్‌ను చేసుకునేందుకు ముందుగా ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్‌లో ఉన్న గూగుల్ ప్లే స్టోర్ (Google Play Store)ను ఓపెన్ చేయాలి.

సెర్చ్ బాక్స్‌లో చాట్ జీపీటీ అని టైప్‌ చేయాలి. ఆ తర్వాత ఓపెన్ ఏఐ రూపొందించిన చాట్ జీపీటీని ఎంపిక చేసుకోవాలి. గూగుల్ ప్లే స్టోర్‌లో పలు కంపెనీలు రూపొందించిన ఫేక్‌ చాట్‌ జీపీటీలు ఎన్నో ఉన్నాయి. కేవలం ఓపెన్ ఏఐ (OpenAI) రూపొందించిన చాట్ జీపీటీనే సెలెక్ట్ చేసుకోవాలి. ఆ యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి.

Exit mobile version