Pathaan Movie | బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్, దీపికా పదుకొణె జంటగా నటిస్తున్న చిత్రం పఠాన్. ఈ చిత్రం జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానున్నది. ప్రస్తుతం సినిమా వివాదాల్లో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. సినిమాకు సంబంధించి మరో బిగ్ అప్డేట్ బయటకు వచ్చింది.
విడుదలకు ముందే చిత్రం ఓటీటీ హక్కులు సైతం అమ్ముడయ్యాయి. సమాచారం మేరకు ‘పఠాన్’ మార్చి చివరిలో లేదంటే.. ఏప్రిల్ మొదటి వారంలో ఓటీటీలో విడుదలయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఓటీటీ విడుదలకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ, డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో కొన్ని కోట్ల రూపాయలకు రిజర్వ్ చేసినట్లు తెలుస్తున్నది.
సినిమాపై ముదురుతున్న వివాదం..
పఠాన్ సినిమా విడుదలకు ముందే వివాదాల్లో చిక్కుకున్నది. చిత్రంలో ‘భేషరమ్ రంగ’ పాటలో దీపికా పదుకొనే కాషాయరంగు బికినీ ధరించింది. దీనిపై సంత్ సమాజ్తో పాటు రాజకీయ నాయకులు సైతం మండిపడ్డారు. పఠాన్ సినిమా హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని, సినిమాను బహిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు.
అలాగే పలు ముస్లిం సంఘాలు సైతం ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు సినిమాను నిషేధించాలని కోరాయి. కొందరు ఎంత వ్యతిరేకించినా మరికొందరు సినిమాకు మద్దతుగా నిలుస్తున్నారు.
రూ.250 కోట్ల బడ్జెట్‌తో..
షారుఖ్ ఖాన్ దాదాపు ఏడు సంవత్సరాల తర్వాత ‘పఠాన్’ మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తుండగా.. దీపికా పదుకొనే జంటగా నటిస్తున్నారు. ఈ సినిమా కోసం షారుఖ్ ఖాన్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
రూ.250కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతాయని మేకర్స్ భావిస్తున్నారు. గతంలో వివాదాస్పదమైన బాలీవుడ్ సినిమాలో బాక్సాఫీస్ వద్ద మంచి వస్కూళ్లను సాధించాయి. వివాదాల్లో చిక్కుకున్న ‘పఠాన్’ ఎంత వరకు లాభపడుతుందో చూడాలి.