Pahalgam Terror Aattack: పహల్గామ్ లో 26మంది పర్యాటకుల మృతికి కారణమైన ఉగ్రదాడికి సంబంధించి దర్యాప్తులో ఎన్ఐఏ కీలక ఆధారాలు సంపాదించింది. పహల్గామ్ ఉగ్రదాడి పాకిస్తాన్ ఉగ్రవాదుల పనే అని తేలింది. పహల్గాం ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చిన ఇద్దరిని ఎన్ఐఏ అధికారులు అరెస్టు చేశారు. బాల్ కోట్ కు చెందిన పర్వీజ్ అహ్మద్, హిల్ పార్క్ కు చెందిన బషీర్ అహ్మద్ లను అరెస్టు చేశారు. వారిని ప్రశ్నించిన ఎన్‌ఐఏ.. పాక్‌కు చెందిన ఉగ్రవాదులే పహల్గాం ఉగ్రదాడికి పాల్పడినట్లు నిర్ధారించింది.
దాడి చేసిన ఉగ్రవాదులు పాకిస్తాన్ జాతీయులని, లష్కరే తోయిబా కు చెందిన వారని పట్టుబడిన ఇద్దరు నిందితులు విచారణలో వెల్లడించారు. ఉగ్రవాదులకు సహకరించిన ఇద్దరి అరెస్టుతో పహల్గామ్ ఉగ్రవాద దాడి దర్యాప్తులో కీలక పురోగతి సాధించనట్లయ్యింది.