Site icon vidhaatha

Pawan Kalyan: వరుణ్ తేజ్- లావ‌ణ్య త్రిపాఠి పెళ్లికి మ‌రో పెద్ద ట్విస్ట్‌.. నిహారిక‌, ప‌వ‌న్ దూరం..!

Pawan Kalyan |

దాదాపు ఆరేడేళ్ల‌ పాటు సీక్రెట్ ప్రేమాయ‌ణం న‌డిపిన వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి జంట జూన్ 9న సీక్రెట్‌గా నిశ్చితార్థం జ‌రుపుకున్న విష‌యం తెలిసిందే.కుటుంబ స‌భ్యులు, సన్నిహితుల మ‌ధ్య‌నే వీరి ఎంగేజ్మెంట్ జ‌రిగింది. వ‌రుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి నిశ్చితార్థాని మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ, పవర్ స్టార్ పవన్ కల్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్ తేజ్, అల్లు అరవింద్, వైష్ణవ్ తేజ్ తోపాటు మెగా ఫ్యామిలీ మొత్తం హాజరై సంద‌డి చేసింది.

ఇక వీళ్లిద్దరికి ఎక్క‌డైతే ప్రేమ పుట్టిందో అక్క‌డే పెళ్లి చేసుకోవాల‌ని భావించిన‌ట్టు అనేక వార్త‌లు వ‌చ్చాయి. వరుణ్, లావణ్య కలిసి మిస్టర్ అనే చిత్రంలో క‌లిసి న‌టించగా, ఈ చిత్ర షూటింగ్ ఇట‌లీల‌లో జ‌రుగుతున్న‌ప్పుడు ఆ స‌మ‌యంలో వీరిమ‌ధ్య ప్రేమ పుట్టింద‌ట‌. అందుకే పెళ్లి కూడా అక్క‌డే చేసుకోవాల‌ని వారు భావించారు.

ఇటలీలోని ఓ ప్రముఖ ప్యాలెస్ లో వరుణ్-లావణ్య వివాహం డెస్టినేష‌న్ వెడ్డింగ్‌గా జరుగుతుందని కొన్నాళ్లుగా వార్త‌లు వ‌స్తున్నాయి. పెళ్లి ఏర్పాట్లని వ‌రుణ్‌- లావ‌ణ్య‌లు స్వ‌యంగా చూసుకుంటున్నార‌ని వార్తలు వచ్చాయి. ఇక వివాహం వచ్చేసి ఈ ఏడాది నవంబర్ లేదా డిసెంబర్ లో చేయనున్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి.

కానీ, ఆగస్టు 24న జ‌ర‌పాల‌నుకుంటున్నారని ఇటీవ‌ల ప్ర‌చారం జ‌రిగింది. క‌ట్ చేస్తే ఇప్పుడు వారి వివాహం డిసెంబ‌ర్‌లో ఉంటుంద‌ని తెలుస్తుంది. ఇటీవ‌లే నిరిక విడాకులు తీసుకోగా, కొద్ది రోజుల్లోనే ఇంట్లో శుభకార్యం చేయడం బాగోదని తండ్రి నాగబాబు అనుకున్నారట. ఈ క్ర‌మంలోనే డిసెంబ‌ర్ లో వారి వివాహం చేసేందుకు ప్లాన్స్ చేస్తున్న‌ట్టు స‌మాచారం.

ఇక వివాహ వేడుక‌కి నిహారిక రాద‌ని అంటున్నారు. ఇటీవ‌ల విడాకులు తీసుకున్న ఆమె అలాంటి శుభ‌కార్యంలో అంద‌రి ముందు సంతోషంగా తిర‌గ‌లేదు. క‌నిపించిన వారంతా అదోలా చూస్తుంటే త‌న‌కు ఏదోలా అనిపిస్తుంద‌ని, అందుకే పెళ్లి డుమ్మా కొట్టాల‌ని అనుకుంటుంద‌ట‌.

వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లికి పవన్ కల్యాణ్ వెళ్తారా? అనే విషయం కూడా ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఆయ‌న రాజ‌కీయాల‌తో బిజీగా ఉంటున్న నేప‌థ్యంలో పెళ్లికి కాకుండా రిసెప్ష‌న్‌కి హాజ‌రవ్వాల‌ని చూస్తున్నాడ‌ట‌. వీటిపై క్లారిటీ రావ‌ల‌సి ఉంది.

Exit mobile version