Site icon vidhaatha

Varun Tej | ఎట్ట‌కేల‌కు త‌న ప్రేమ గురించి ఓపెన్ అయిన వ‌రుణ్‌.. ముందు ఎవ‌రు ప్రపోజ్ చేశారంటే..!

Varun Tej |

మ‌రి కొద్ది రోజుల‌లో మెగా ఇంట పెద్ద వేడుక జ‌ర‌గ‌నున్న విష‌యం తెలిసిందే. ఐదారేళ్ల పాటు ప్రేమ‌లో ఉన్న వ‌రుణ్ తేజ్- లావ‌ణ్య త్రిపాఠిలు జూన్ 9న నిశ్చితార్థం జ‌రుపుకోగా, ఈ ఏడాదే వారి పెళ్లి జ‌ర‌గ‌నుంది. ఈ వేడుక కోసం మెగా ఫ్యాన్స్ అంద‌రు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. పెళ్లికి సంబంధించి కూడా అనేక వార్త‌లు నెట్టింట హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి.

పెళ్లి డెస్టినేష‌న్ వెడ్డింగ్‌గా జ‌ర‌గ‌నుంద‌ని, ఇక పెళ్లి త‌ర్వాత హైద‌రాబాద్‌లో రిసెప్ష‌న్ ఏర్పాటు చేసి ఆ వేడుక‌కి ఇండ‌స్ట్రీకి సంబంధించిన ప్ర‌ముఖులు అందరిని ఆహ్వానించ‌బోతున్న‌ట్టు స‌మాచారం. అయితే త‌మ ప్రేమ‌, పెళ్లి గురించి ఇంత వ‌ర‌కు స్పందించ‌ని వ‌రుణ్ తేజ్ తన తాజా చిత్రం గాంఢీవ‌ధారి అర్జున చిత్ర ప్ర‌మోష‌న్ లో భాగంగా ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఓపెన్ అయ్యాడు.

వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి దాదాపు ఐదారేళ్లుగా ప్రేమించుకుంటున్నప్పటికీ ఆ విషయాన్ని ఎందుకు బ‌య‌ట‌కు చెప్ప‌లేదు అనే విష‌యాన్ని కూడా తాజాగా తెలియ‌జేశాడు. మాకు కూడా అంద‌రిలా బ‌య‌ట‌కు వెళ్లాల‌ని, డిన్న‌ర్ చేయాల‌ని అనిపించేది.

కాని అది ఎందుకు త్యాగం చేశామంటే.. మా రిలేష‌న్ గురించి చ‌ర్చ మొద‌లైన‌ప్పుడు అది ఎక్క‌డ మా రిలేష‌న్‌లో చిన్న డిస్ట్రబెన్స్ క్రియేట్ చేస్తుందేమోనన్న భ‌యంతో మా ల‌వ్ విష‌యాన్ని సీక్రెట్‌గా ఉంచాం. నా ప‌ర్స‌న‌ల్ విష‌యాల‌ని బ‌య‌ట‌కు చెప్పుకోవ‌డానికి పెద్ద‌గా ఇష్టం ఉండ‌దు. నా ప్రేమ వ్య‌వ‌హారంలో మా ఇంట్లో వాళ్లు చాలా ఓపెన్. నా నిర్ణ‌యంపై వాళ్ల‌కి న‌మ్మ‌కం ఎక్కువ.

అలానే లావణ్య ఇంట్లో కూడా ఆమెని చాలా బాగా నమ్ముతారు. కెరీర్ లో భాగంగా చాలా చిన్న వయసులోనే ఇంట్లోంచి బయటకొచ్చి ముంబయి, హైదరాబాద్ లో ఉండేది. లావణ్య తీసుకునే నిర్ణయాల్ని ఆమె తల్లిదండ్రులు ఎప్పుడూ గౌరవిస్తూనే ఉంటారు. మా ప్రేమకు ఇరు కుటుంబాల నుంచి ఎలాంటి ఇబ్బంది లేదు. లావణ్య త్రిపాఠికి తనంటే ఇష్టమనే విషయం తెలుసుకున్న నేను ముందుగా ప్ర‌పోజ్ చేశాను.

ఈ ఐదారేళ్ల‌లో ఇద్ద‌రం చాలా గిఫ్ట్స్ ఇచ్చి పుచ్చుకున్నాం. నేను వాడుతున్న ఐఫోన్ కూడా తానిచ్చిన గిఫ్ట్ అని వ‌రుణ్ స్ప‌ష్టం చేశాడు. ఇక త‌న పెళ్లి ఎప్పుడు జ‌రుగుతుంద‌నే విష‌యాన్ని మాత్రం స‌స్పెన్స్ లో పెట్టాడు. న‌వంబ‌ర్ జ‌ర‌గ‌నున్న‌ట్టు ప్రచారం అయితే జ‌రుగుతుంది.

Exit mobile version