క్రీడలతో మానసిక ప్రశాంతత: సునీతా లక్ష్మారెడ్డి

లక్ష్మారెడ్డి మెమోరియల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వాలీబాల్ టోర్న‌మెంట్‌ క్రీడాకారులను ప్రోత్సహిస్తున్న‌రాష్ట్ర ప్రభుత్వం: ఎంపీ ప్రభాకర్ రెడ్డి గెలుపోట‌ములు స‌మానం: ఎమ్మెల్యే మదన్ రెడ్డి విధాత, మెదక్ ఉమ్మడి జిల్లా బ్యూరో: క్రీడల ద్వారా మానసిక ఉల్లాసంతో పాటు, మానసిక ప్రశాంతత లభిస్తుందని, శారీరకంగా ఆరోగ్యవంతులు అవుతార‌ని మహిళా కమిషన్ చైర్పర్సన్ వాకిటి సునీత లక్ష్మారెడ్డి అన్నారు. వాకిటి లక్ష్మారెడ్డి 60వ‌ జయంతి సందర్భంగా నర్సాపూర్ లోని బి వి ఆర్ ఐ టి కళాశాల […]

  • Publish Date - December 19, 2022 / 02:55 PM IST
  • లక్ష్మారెడ్డి మెమోరియల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వాలీబాల్ టోర్న‌మెంట్‌
  • క్రీడాకారులను ప్రోత్సహిస్తున్న‌రాష్ట్ర ప్రభుత్వం: ఎంపీ ప్రభాకర్ రెడ్డి
  • గెలుపోట‌ములు స‌మానం: ఎమ్మెల్యే మదన్ రెడ్డి

విధాత, మెదక్ ఉమ్మడి జిల్లా బ్యూరో: క్రీడల ద్వారా మానసిక ఉల్లాసంతో పాటు, మానసిక ప్రశాంతత లభిస్తుందని, శారీరకంగా ఆరోగ్యవంతులు అవుతార‌ని మహిళా కమిషన్ చైర్పర్సన్ వాకిటి సునీత లక్ష్మారెడ్డి అన్నారు. వాకిటి లక్ష్మారెడ్డి 60వ‌ జయంతి సందర్భంగా నర్సాపూర్ లోని బి వి ఆర్ ఐ టి కళాశాల ప్రాంగణంలో వాకిడి లక్ష్మారెడ్డి మెమోరియల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సోమ‌వారం నుండి 5 రోజుల పాటు నిర్వహించనున్న వాలీబాల్ టోర్నమెంటును జ్యోతి వెలిగించి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ లక్ష్మారెడ్డికి క్రీడలు అంటే ఎంత ఆసక్తి అని, క్రికెట్, వాలీబాల్ అంటే చాలా పిచ్చి అని వారి జ్ఞాపకార్థం ప్రతియేటా వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నామని అన్నారు. మట్టిలో మాణిక్యాలైన గ్రామస్థాయిలో క్రీడాకారుల ప్రతిభను వెలికి తీయాలనే ఉద్దేశంతో నర్సాపూర్ నియోజక వర్గంలో చేపట్టిన ఈ టోర్నమెంట్ కు అనూహ్య స్పందన లభించిందని 8 మండలాల నుండి 118 టీములు వాలీబాల్ ఆడడానికి ముందుకు రావ‌డం ఆనందంగా ఉంద‌న్నారు.

క్రీడల నిర్వ‌హ‌ణ‌తో మెళ‌కువలు తెలవడంతోపాటు స్నేహ భావం పెంపొందుతుందని అన్నారు. గెలుపు ఓటములు సహజమని ప్రతి ఒక్కరు గెలుపే లక్ష్యంగా పోరాట స్ఫూర్తి ప్రదర్శించాలన్నారు. టోర్నమెంట్ ముగింపు రోజు 23న ప్రజా ప్రతినిధులు కూడా టోర్నమెంటులో పాల్గొనాల‌ని కోరారు.

ఈ టోర్నమెంటులో గెలుపొందిన మొదటి విజేతకు రూ.50 వేలు, ద్వితీయ రూ.35000, తృతీయ రూ.10,000, నాలుగో బహుమతిగా 5000 రూపాయల నగదును ఈ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అందజేస్తామని తెలిపారు. అంతేగాక క్రీడల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రశంసాపత్రం, జ్ఞాపిక అందజేస్తామని సునీత లక్ష్మారెడ్డి చెప్పారు.

కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన పార్లమెంటు సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులను ఎంతో ప్రోత్సహిస్తున్నదని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతి గ్రామంలో తెలంగాణ క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. గతంలో పిల్లలు క్రీడా మైదానాలకు వెళ్లి క్రికెట్, కోతికొమ్మ‌చ్చి, వాలీబాల్, ఫుట్బాల్, కబడ్డీ ఖో ఖో వంటి ఎన్నో ఆటోలు ఆడేవారని, కానీ నేడు మొబైల్ ఫోన్‌లు వచ్చి వారి జీవితాలతో ఆడుకుంటున్నాయని అన్నారు.

నేడు యువత చరవాణిలకు బానిసలు అయ్యారని, క్రీడలు కనుమరుగయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. యువత క్రీడలు ఆడడం ద్వారా శారీరికంగా, మానసికంగా స్థిరత్వం కలిగి ఉంటారని, ఆ దిశగా ప్రభుత్వం కూడా యువతను క్రీడలువైపు దృష్టి సారించేలా కృషి చేస్తున్నదని అన్నారు.

నేడు యువత చారవాణిలో మాట్లాడుతూ వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రోజు ఏదో ఒక ప్రాంతంలో యువత ప్రమాదాలకు గురవుతూ హెడ్ ఇంజరీస్ అవుతున్నారని, కాబట్టి ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలని సూచించారు.

నర్సాపూర్ శాసనసభ్యులు మదన్ రెడ్డి మాట్లాడుతూ క్రీడల పట్ల ఆసక్తితో ఏర్పాటు చేసిన ఈ టోర్నమెంట్లో యువత ఐక్యమత్యంతో ఒకరికి ఒకరు సహకరించుకుంటూ క్రమశిక్షణతో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. గెలుపు ఓటములు రెండు సమానమే అని, వాటిని సమదృష్టితో చూడాలని హితవు చెప్పారు. ఉద్యోగాలలో క్రీడాకారులకు రిజర్వేషన్లు ఉంటాయని వాటిని సాధించుటకు కృషి చేయాలని అన్నారు.

కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ అధ్యక్షులు చంద్ర గౌడ్, లేబర్ వెల్ఫేర్ బోర్డ్ అధ్యక్షులు దేవేందర్ రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ వెంకటరెడ్డి, బి.వి.ఆర్.ఐ.టి కాంతారావు, పి ఈ టి లు, జడ్పిటిసిలు, ఎంపీపీలు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.