Peddapalli | కూతురును చూడడానికి వచ్చి.. గుండెపోటుతో మృతి
Peddapalli విధాత: మృత్యు ఏ రూపంలో వస్తుందో తెలుసుకోవడం కష్టమే. గురుకుల పాఠశాలలో చదువుతున్న కూతురును చూడడానికి వచ్చిన ఓ తండ్రి అక్కడే గుండెపోటుకు గురయ్యారు. అత్యవసర వైద్యం కోసం ఆయనను కరీంనగర్ తరలిస్తుండగా రైల్వే గేటు మృత్యుపాషంలా మారింది. పెద్దపల్లి జిల్లా వెలగటూరు మండలం స్థంభంపల్లి గ్రామానికి చెందిన విజయ్ ధర్మారం మండలంలోని మల్లాపూర్ గురుకుల పాఠశాలలో చదువుతున్న తన కూతురు స్పందనను చూడడానికి వచ్చి అక్కడే గుండెపోటుకు గురయ్యారు. వెంటనే ఆయనను అంబులెన్స్ లో […]

Peddapalli
విధాత: మృత్యు ఏ రూపంలో వస్తుందో తెలుసుకోవడం కష్టమే. గురుకుల పాఠశాలలో చదువుతున్న కూతురును చూడడానికి వచ్చిన ఓ తండ్రి అక్కడే గుండెపోటుకు గురయ్యారు. అత్యవసర వైద్యం కోసం ఆయనను కరీంనగర్ తరలిస్తుండగా రైల్వే గేటు మృత్యుపాషంలా మారింది.
పెద్దపల్లి జిల్లా వెలగటూరు మండలం స్థంభంపల్లి గ్రామానికి చెందిన విజయ్ ధర్మారం మండలంలోని మల్లాపూర్ గురుకుల పాఠశాలలో చదువుతున్న తన కూతురు స్పందనను చూడడానికి వచ్చి అక్కడే గుండెపోటుకు గురయ్యారు.
వెంటనే ఆయనను అంబులెన్స్ లో కరీంనగర్ తరలిస్తుండగా తీగల గుట్టపల్లి రైల్వే లెవెల్ క్రాసింగ్ వద్ద
గేటు వేసి ఉండడంతో, తక్షణ వైద్యం అందక ఆయన అక్కడే మృత్యువాత పడ్డారు. అంబులెన్స్ లో రోగి పరిస్థితి విషమంగా ఉందని ప్రాధేయపడ్డా, రైల్వే గేట్ మెన్ తమ శాఖ నిబంధనలకు లోబడి గేటు తీయడానికి నిరాకరించారు.
ఈ లోగానే విజయ్ మరో సారి గుండెపోటుకు గురయ్యారు. స్థానికులు, అంబులెన్స్ సిబ్బంది సిపిఆర్ చేసినప్పటికీ ఆయన ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.