Site icon vidhaatha

సౌందర్య తపనే శత్రువైందా? షెఫాలీ మృతిపై వైద్యుల అనుమానం

• నిరంతర యవ్వనచికిత్స కోసం క్యూ కడుతున్న తారలు
• ఆందోళన కలిగిస్తున్న నటి షెఫాలీ జరీవాలా మృతి
• వాడకం అత్యంత ప్రమాదకరమంటున్న వైద్య ప్రముఖులు

Shefali Jariwala death | ప్రముఖ మోడల్, నటి షెఫాలీ జరీవాలా ఆకస్మిక మృతి యాంటీ-ఏజింగ్ చికిత్సలపై దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ‘కాంటా లగా(Kaanta laga)’ పాట ద్వారా గుర్తింపు పొందిన షెఫాలీ, 42 ఏళ్ల వయసులో జూన్ 27న గుండెపోటుతో మృతి చెందారు. ఆమె మృతికి కారణాలు ఇప్పటికీ అధికారికంగా వెల్లడికాకపోయినా, ప్రాథమికంగా వెల్లడవుతున్న సమాచారం ప్రకారం ఆమె ఖాళీ కడుపుతో యాంటీ-ఏజింగ్ ఇంజెక్షన్ తీసుకున్న విషయం వెలుగులోకి వచ్చింది.

వైద్య నిపుణుల వివరాల ప్రకారం, షెఫాలీ గ్లుటాథియాన్, విటమిన్ C (Glutathione and Vitamin C)కలిగిన ఇంజెక్షన్‌ను ఖాళీ కడుపుతో తీసుకున్నారని, దానివల్ల ఒక్కసారిగా రక్తపోటు పడిపోవడం, దాంతో గుండెపోటు సంభవించి ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. గ్లుటాథియాన్ఒక శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ అయినప్పటికీ, దీన్ని నిర్ధిష్ట వైద్య పర్యవేక్షణ లేకుండా, ముఖ్యంగా శరీరం డీహైడ్రేట్ అయి ఉండే సమయంలో వాడితే తీవ్ర ప్రభావాలు చూపించవచ్చు.
రూబీ హాల్ క్లినిక్‌కు చెందిన డా. అనేశ్ జైన్, “ఈ రకమైన ఇంజెక్షన్లు ఉపవాసం ఉన్నప్పుడు తీసుకుంటే హృదయవ్యవస్థపై తీవ్ర ఒత్తిడిని కలిగించవచ్చు. లో బిపి (తక్కువ రక్తపోటు) గుండె ఆగిపోవడానికి దారితీయవచ్చు. ఇది అరుదుగా జరిగినా, మరణకారకమవుతుంది,” అన్నారు.అయితే గ్లుటాథియాన్–విటమిన్Cకి అమెరికా FDA (Food and Drug Administration) ఆమోదం లేదని స్పష్టంగాతెలుస్తోంది. చర్మం తెల్లగా అవడానికి లేదా యాంటీ-ఏజింగ్ ఉద్దేశ్యాల కోసం ఈ ఔషధాలను ఉపయోగించడం ఆమోదించబడలేదు. FDA ఇప్పటికే గ్లుటాథియాన్ఇంజెక్షన్ల విషయంలో జాగ్రత్తలు సూచిస్తూ, ఇవి కాలేయం, కిడ్నీలు, నాడీ వ్యవస్థపై దుష్ప్రభావాలు చూపే అవకాశం ఉందని హెచ్చరించింది.ఇక భారతదేశంలో కూడా ఈ ఔషధాలు మినహాయింపుగా కొన్ని ప్రత్యేక వైద్య ప్రయోజనాలకే సీడీఎస్‌సీఓ (Central Drugs Standard Control Organisation) అనుమతినిస్తుంది. కానీ అవి స్కిన్ లైటెనింగ్, యాంటీ-ఏజింగ్ లాంటి సౌందర్య ప్రయోజనాల కోసం వాడకూడదు.

ఈ నేపథ్యంలో, షెఫాలీ జరీవాలా గదిలో పెద్ద మొత్తంలో యాంటీ-ఏజింగ్ మందులు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఆమె గదిలో ఫ్రిడ్జ్, టేబుల్, డ్రాయర్లలో గ్లుటాథియాన్ సహా అనేక మందులు ఉండటం కలకలం రేపుతోంది.విశ్వసనీయ సమాచారం ప్రకారం, ఆమె ఎనిమిదేళ్ల కిందట ఒకసారి డాక్టర్‌ను సంప్రదించిన తర్వాత స్వయంగా ఇంజెక్షన్లు, మందులు వాడుతూవస్తోంది. తాను తీసుకుంటున్న మందులపై ప్రస్తుతానికి ఎటువంటి వైద్య పర్యవేక్షణ లేదని సమాచారం.లిలావతి హాస్పిటల్‌కు చెందిన డా. శ్రీనివాస్ కుడ్వా తెలియజేసిన ప్రకారం, యాంటీ-ఏజింగ్ పేరుతో వాడే హార్మోన్ ఆధారితమందులు రక్తపోటును పెంచడం, ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని పెంచడం, కొవ్వుజీర్ణక్రియను మారుస్తున్నట్లుసూచిస్తోందని, ఇది హృదయ సంబంధిత(Heart related) సమస్యలకు దారి తీసే ప్రమాదం ఉందని తెలిపారు. మహిళల్లో గుండె సంబంధిత వ్యాధులు మరింత వేగంగా పెరుగుతున్నాయని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. “గుండెపోటు లక్షణాలు పురుషుల కంటే మహిళల్లో భిన్నంగా ఉండవచ్చు. అలసట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, నొప్పి లేని వాపు లాంటి లక్షణాలు చాలా సార్లు తప్పుగా గుర్తించబడతాయి. దీనివల్ల చికిత్స ఆలస్యం అవుతుంది,” అని ఆసియన్ హాస్పిటల్ చైర్మన్ డా. సుబ్రత్ అఖౌరీ వెల్లడించారు.

డా. అభిజిత్ ఖడ్తారే మాట్లాడుతూ, “తీవ్రమైన హైపోటెన్షన్ (తక్కువ బీపీ) ఊపిరితిత్తులకు, మెదడుకు రక్తసరఫరా తగ్గించి, షాక్‌లోకి తీసుకెళ్తుంది. ఇది ఒక అత్యవసర పరిస్థితి. తక్కువ బీపీ వల్ల ఉన్నచోటే మూర్చ, శరీరం చల్లబడటం, లయతప్పిన హృదయ స్పందనలు కనిపిస్తే వెంటనే వైద్య సహాయం అవసరం” అన్నారు.
ముఖ్యంగా, ఈ ఘటన యాంటీ-ఏజింగ్ పేరుతో జరుగుతున్న స్వీయ వైద్య వైఖరిపై తీవ్ర ఆందోళనను కలిగిస్తోంది. డా. ప్రవీణ్ గుప్తా వ్యాఖ్యానించినట్లు – ప్రస్తుతం యాంటీ-ఏజింగ్ ఔషధాలను ఇంటర్నెట్‌లో అడ్డదిడ్డంగా అమ్ముతున్నారు. వాటిని నిపుణుల పర్యవేక్షణ లేకుండా వాడటంచావుకు ఆహ్వానం పలికినట్లే.
అంతిమంగా, షెఫాలీబాధారకరమైన మృతి అందరికీ ఓ హెచ్చరికగా నిలవాలి. వైద్యుల సలహా, నిరంతర పర్యవేక్షణ లేకుండాయాంటీ-ఏజింగ్ పేరుతో ఎటువంటి ఔషధాన్నితీసుకోకూడదు. యవ్వనంగా కనిపించాలన్న తపనలో ముప్పును స్వయంగా ఆహ్వానించుకోకూడదు

Exit mobile version