ORR Car Overturn| ఔటర్ రింగ్ రోడ్డుపై కారు బోల్తా..ఇన్ఫోసిస్‌ ఉద్యోగిని మృతి

ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదంలో కారు బోల్తా కొట్టింది. ఈ ఘటనలో ఇన్ఫోసిస్ ఉద్యోగికి సౌమ్యారెడ్డి మృతి చెందగా..మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

ORR Car Overturn| ఔటర్ రింగ్ రోడ్డుపై కారు బోల్తా..ఇన్ఫోసిస్‌ ఉద్యోగిని మృతి

విధాత, హైదరాబాద్: పెద్ద అంబర్‌పేట ఔటర్ రింగ్ రోడ్డు(ORR Car Overturn)పై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓఆర్‌ఆర్‌ పై ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఇన్ఫోసిస్‌ ఉద్యోగిని(Infosys Employee)న సౌమ్యారెడ్డి(Soumya Reddy) మృతి(Death)చెందగా.. మరో ఏడుగురు ఇన్ఫోసిస్ ఉద్యోగులకు తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు. గాయపడిన నంద కిశోర్‌, వీరేంద్ర, ప్రణీష్‌, అరవింద్‌, సాగర్‌, ఝాన్సీ, శ్రుతి ఉన్నారు.

ప్రమాదంలో మృతురాలు సౌమ్యా రెడ్డి స్వస్థలం సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం వావిలాలగా గుర్తించారు. ఇన్ఫోసిస్‌ ఉద్యోగులు సరళ మైసమ్మ ఆలయానికి వెళ్లి వస్తుండగా అబ్దుల్లాపూర్‌మెట్‌ ఓఆర్‌ఆర్‌ సమీపంలో కారు బోల్తా కొట్టింది. ప్రమాద ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.