Duleep Trophy 2025| దులీప్ ట్రోఫీ విజేత సెంట్రల్ జోన్
దేశవాళీ క్రికెట్ లో ప్రతిష్టాత్మకమైన దులీప్ ట్రోఫీని సెంట్రల్ జోన్ జట్టు కైవసం చేసుకుంది. ఫైనల్‌లో సౌత్ జోన్ నిర్ధేశించిన 65పరుగుల స్వల్ప లక్ష్యాన్ని చేధించిన సెంట్రల్ జోన్ టీమ్ 6వికెట్ల తేడాతో గెలిచి దులీప్ ట్రోఫీని గెలుచుకుంది.
విధాత : దేశవాళీ క్రికెట్ లో ప్రతిష్టాత్మకమైన దులీప్ ట్రోఫీ(Duleep Trophy 2025)ని సెంట్రల్ జోన్(Central Zone wins) జట్టు కైవసం చేసుకుంది. సౌత్ జోన్(South Zone)తో జరిగిన ఫైనల్‌లో ఐదవ రోజు ఆటలో 65పరుగుల స్వల్ప లక్ష్యాన్ని చేధించిన సెంట్రల్ జోన్ టీమ్ 6వికెట్ల తేడాతో గెలిచి దులీప్ ట్రోఫీని గెలుచుకుంది. సౌత్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 149 పరుగులకు అలౌట్ అయ్యింది. ఓపెనర్ తన్మయ అగర్వాల్ చేసిన 31పరుగులే ఆత్యధిక స్కోర్. సెంట్రల్ బౌలర్లలో సారాంశ్ జైన్ 5వికెట్లు, కుమార కార్తీకేయ 4వికెట్లు పడగొట్టి సౌత్ జోన్ ను కుప్పకూల్చారు. తర్వాతా సెంట్రల్ జోన్ తొలి ఇన్నింగ్స్ లో 511 పరుగులు చేసింది. యశ్ రాథోడ్(Yash Rathod) 194, కెప్టెన్ రజత్ పాటిదార్(Rajat Patidar) 101, సారాంశ్ జైన్ 69, డానిష్ మాలేవర్ 53పరుగులు సాధించారు. సౌత్ బౌలర్లు గురుప్రీత్ సింగ్, అంకిత్ శర్మ తలో 4వికెట్లు, ఎండీ నిధీష్, వాసుకీ కౌశిక్ లు చెరో వికెట్ సాధించారు.
రెండో ఇన్నింగ్స్‌లో సౌత్ జోన్ 426 పరుగులు చేసింది. అంకిత్ శర్మ 99పరుగులు, అంద్రే సిద్దార్థ్ 84*, రవిచంద్రన్ సమరన్ 67పరుగులతో రాణించారు. సెంట్రల్ బౌలర్లు కుమార కార్తీకేయ 4, సారాంశ్ జైన్ 3, దీపక్ చహార్ 1, కుల్దీప్ సేన్ 1వికెట్ సాధించారు.
విజయం కోసం 65 పరుగుల స్వల్ప లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన సెంట్రల్ జోన్ అనూహ్యంగా వెంటవెంటనే 4 వికెట్లు కోల్పోయినప్పటికి 15.5ఓవర్లలో విజయ లక్ష్యాన్ని ఛేదించింది. రెండో ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు డానిష్ మాలేవర్ 5, శుభమ్ శర్మ 8, సారాంశ్ జైన్ 4, రజత్ పాటిదార్ 13పరుగులకు అవుటవ్వగా.. అక్షయ్ 19*, యశ్ రాథోడ్ 13* పరుగులు చేశారు. సౌత్ జోన్ బౌలర్లలో గుర్జాప్ నీత్ సింగ్, అంకిత్ శర్మ చెరో 2 వికెట్లు చేశారు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా యశ్ రాథోడ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా సారాంశ్ జైన్ ఎంపికయ్యారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram