Gold, Silver Price Rise| మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు

బంగారం, వెండి ధరలు మరోసారి పెరిగాయి. గురువారం 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 2,290పెరిగి రూ.1,56,490 వద్ద కొనసాగుతుంది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ 2,100పెరిగి రూ. 1,43,450వద్ద నిలిచింది. కిలో వెండి ధర రూ.10,000పెరిగి రూ.2,70,000 లకు చేరింది.

Reported by: Y.V. Narsimha Reddy | వాణిజ్యం | Feb 19, 2026, 10:45 am IST
Read Time: 3 mins
Gold, Silver Price Rise| మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు

విధాత, హైదరాబాద్ : బంగారం, వెండి ధరలు మరోసారి పెరిగాయి. గురువారం 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 2,290పెరిగి రూ.1,56,490 వద్ద కొనసాగుతుంది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ 2,100పెరిగి రూ. 1,43,450వద్ద నిలిచింది. కిలో వెండి ధరలు సైతం మళ్లీ పెరుగుదల బాట పట్టాయి. కిలో వెండి ధర రూ.10,000పెరిగి రూ.2,70,000 లకు చేరింది.

భారత్ లో ఫిబ్రవరి 18నుంచి శుభకార్యాల సీజన్ మొదలైన సందర్బంలో మళ్లీ బంగారం, వెండి ధరలు పెరుగుదల బాట పట్టడం కొనుగోలుదారులను కలవర పెడుతుంది. ఇంకా ధరలు పెరుగుతాయా లేక తగ్గుతాయా అన్న సందేహాల మధ్య కొనుగోలు దారులు గందరగోళానికి గురవుతున్నారు.

అంతర్జాతీయ పరిణామాలతో మళ్లీ పెరుగుదల

అంతర్జాతీయ ఆర్థిక, రాజకీయ పరిణామాలలో వస్తున్న మార్పులు బంగారం, వెండి సహా విలువైన లోహాల ధరలలో మార్పులకు కారణమవుతున్నాయి.  అమెరికా  ఇరాక్ పై యుద్దం సిద్దమవుతుండటం మరోసారి అంతర్జాతీయ మార్కెట్లలో అస్థిరతలు రేపుతుంది.

అమెరికా ఫెడరల్ బ్యాంకు వడ్డీ రేట్లు, డాలర్ విలువలో మార్పులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, వాస్తవ వడ్డీ రేట్లలో ఒడిదుడుకులు బంగారం, వెండి ధరలు హెచ్చు తగ్గులకు కారణమవుతున్నాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అమెరికా,  ఇరాక్ యుద్దం మొదలైతే బంగారం, వెండి ధరలలో మార్పులను మరింత ప్రభావితం చేయవచ్చంటున్నారు.