ఫోన్ Switchof ఆరోగ్యానికి మంచిదా? అధ్యయనం చెబుతున్న షాకింగ్ నిజాలు

విధాత‌: ఆధునిక ఆవిష్కరణల్లో స్మార్ట్ ఫోన్ ఒక అద్భుతం. దీని మాయాజాలంలో చిక్కని మనిషి లేడు. కమ్యూనికేషన్ వారధి ఇది. కానీ మనుషుల మధ్య దూరాన్ని పెంచుతోంది. పొద్దున లేస్తే ఏ పని చెయ్యాలన్నీ ఫోన్ కావల్సిందే. అయితే మానవ సంబంధాల మీద దీని ప్రభావం చాలా ఉంటోందనేది కాదనలేని నిజం. లాక్ డౌన్ లో స్మార్ట్ పోన్ వినియోగ ప్రభావం మారిన కమ్యూనికేషన్ విధానం, వ్యక్తుల మానసిక, శారీరక ఆరోగ్యాల మీద దీని ఇంపాక్ట్ గురించి […]

  • Publish Date - December 20, 2022 / 05:13 AM IST

విధాత‌: ఆధునిక ఆవిష్కరణల్లో స్మార్ట్ ఫోన్ ఒక అద్భుతం. దీని మాయాజాలంలో చిక్కని మనిషి లేడు. కమ్యూనికేషన్ వారధి ఇది. కానీ మనుషుల మధ్య దూరాన్ని పెంచుతోంది. పొద్దున లేస్తే ఏ పని చెయ్యాలన్నీ ఫోన్ కావల్సిందే. అయితే మానవ సంబంధాల మీద దీని ప్రభావం చాలా ఉంటోందనేది కాదనలేని నిజం.

లాక్ డౌన్ లో స్మార్ట్ పోన్ వినియోగ ప్రభావం మారిన కమ్యూనికేషన్ విధానం, వ్యక్తుల మానసిక, శారీరక ఆరోగ్యాల మీద దీని ఇంపాక్ట్ గురించి ప్రముఖ మొబైల్ కంపెని వీవో ఇండియా నిర్వహించిన అధ్యయన ఫలితాలను ‘Smartphones and their impact on human relationships 2020’ గా ప్రకటించింది.

స్మార్ట్ ఫోన్ జీవితంలో పెద్ద భాగం ఆక్రమించింది. ఫ్రెండ్స్, కుటుంబం మాత్రమే కాదు దేనితో కమ్యూనికేట్ కావాలన్నా స్మార్ట్ ఫోన్ కావాలి. లాక్ డౌన్ల నడుమ ఇంటికే పరిమితమైన 2020 కాలంలో దీని ప్రాముఖ్యత మరింత పెరిగింది. అంతేకాదు ఇంట్లో నుంచే ప్రపంచంతో సంబంధాన్ని నెరపగలిగే అవకాశం కల్పించడం వల్ల క్వాలిటీ ఆఫ్ లైఫ్ దెబ్బతినకుండా కాపాడింది నిజానికి స్మార్ట్ ఫోనే. అయితే స్మార్ట్ ఫోన్ వినియోగం ఎక్కువైతే మాత్రం ఇది వ్యసనంగా మారే ప్రమాదం ఉంటుంది.

భారతీయుల్లో 66 శాతం మంది స్మార్ట్ ఫోన్ జీవన నాణ్యతను పెంపొందిస్తుందని నమ్ముతున్నారు. అయితే 75 శాతం భారతీయులు స్మార్ట్ ఫోన్ వినియోగం పెరిగే కొద్దీ మానసిక, శారీరక ఆరోగ్యం పై ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు. అంతేకాదు 74 శాతం కాసేపు మొబైల్ పోన్ ఆఫ్ చేస్తే కుటుంబంతో ఎక్కువ సమయం గడపవచ్చని చెప్పారు. అయితే కేవలం 18 శాతం మంది మాత్రమే తమ ఫోన్లను స్విచ్ ఆఫ్ చేసినట్టు ఒప్పుకున్నారట.

2020 అనుకోని విపత్తుల సంవత్సరం. పాండమిక్ నడిపిన దిశలో ప్రపంచం నడుచుకుంది. స‌మాజానికి దూరంగా ఉండడం వల్ల స్మార్ట్ ఫోన్ కేంద్రంగా బతుకు నడిచింది. ఆఫీస్ పని కావచ్చు, స్కూల్ చదువు నుంచి ఉన్నత విద్య వరకు, ఫ్రెండ్స్, దూరంగా ఉన్న ఫ్యామిలీ ఎవరితో అయినా టచ్ లో ఉండాలంటే అన్నింటికి కావల్సింది స్మార్ట్ ఫోనే దిక్కు.

స్మార్ట్ ఫోన్ తో కమ్యూనికేషన్ సాధ్యమైంది నిజమే కానీ కొందరికి అది వ్యసనంగా మారింది. మానవ సంబంధాల మీద ప్ర‌భావం మాత్రం కచ్చితంగా చూపింది అని నివేదిక ప్రారంభ సమయంలో వీవో బ్రాండ్ డైరెక్టర్ గా పనిచేస్తున్న నిపున్ తన అభిప్రాయం తెలిపారు.

మానవ సంబంధాలపై స్మార్ట్ ప్రభావం గురించి జరిపిన సర్వే ద్వారా స్మార్ట్ ఫోన్ల వినియోగంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సి ఉంటుందని ప్రజలకు అవగాహన కలిగించాలని వీవో ఇండియా లక్ష్యంగా పెట్టకున్నట్టు వీవో అధికారులు ప్రకటించారు.

ఈ అధ్యయనంలోని ముఖ్యాంశాలు

  • పాండమిక్ తర్వాత 25 శాతం వరకు స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరిగింది
  • లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచి భారతీయులు స్మార్ట్ పోన్ లో ఎక్కువ సమయం గడుపుతున్నారు. 59 శాతం ఓటీటీ, సోషల్ మీడియా 55 శాతం, 45 శాతం గేమింగ్ లో ఉంటున్నారట.
  • స్మార్ట్ ఫోన్లు తమ ఆత్మీయులతో కనెక్టెడ్ గా ఉండేందుకు చాలా అవసరం అని 79 శాతం మంది నమ్ముతున్నారు.
  • క్వాలిటీ ఆఫ్ లైఫ్ స్మార్ట్ పోన్లతో మెరుగవుతుందని 66 శాతం మంది నమ్ముతున్నారు.
  • ఫోన్ ఎక్కువ వినియోగిస్తున్నావు అని కంప్లైంట్ చేస్తున్నారు చుట్టూ ఉన్న వారు అని 88 శాతం మంది చెబుతున్నారు.
  • గంట సమయం పాటు సంభాషణలో ఉంటే 46 శాతం కనీసం 5 సార్లు ఫోను చూసుకుంటున్నారు.
  • 84 శాతం మంది నిద్ర లేచిన 15 నిమిషాల్లోపు తమ ఫోన్లు చెక్ చేసుకుంటారు.
  • 89 శాతం మంది సొంత వారితో గడిపే సమయం మీద స్మార్ట్ ఫోన్ ప్రభావం ఉంటోందని అంగీకరిస్తున్నారు.
  • స్మార్ట్ ఫోన్లకు దూరంగా ఉండాల్సిన అవసరం ఉందని 74 శాతం అభిప్రాయపడ్డారు.
  • శారీరక మానసిక ఆరోగ్యం కోసం మన స్మార్ట్ పోన్లను #SwitchOf చేద్దాం ను పాటించాలి.
  • స్మార్ట్ ఫోన్లలో గడిపే సమయం తగ్గితే 73 శాతం మంది సంతోషంగా ఉండగలరు
  • మొబైల్ ఫోన్‌ను వీలును బట్టి కొంత సమయం స్విచ్ ఆఫ్ చెయ్యడం కుటుంబంతో ఎక్కువ సమయం గడపేందుకు అవకాశం దొరుకుతుందని 74 శాతం మంది అంగీకరించారు.