Site icon vidhaatha

Pilli Ramaraju | స్వతంత్ర అభ్యర్ధిగా నల్లగొండలో పోటీ: పిల్లి

Pilli Ramaraju | విధాత: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో నల్లగొండ అసెంబ్లీ స్థానం నుంచి బీఆరెస్ రెబల్‌గా, స్వతంత్ర అభ్యర్ధిగా తాను పోటీ చేస్తానని ఈ విషయంలో ఎలాంటి వెనుకడుగు లేదని బీఆరెస్ నేత, నల్లగొండ కౌన్సిలర్ పిల్లి రామరాజు యాదవ్ స్పష్టం చేశారు. బుధవారం ఆయన తన మద్దతుదారులు 2వేల మందితో ముఖ్య కార్యకర్తల ఆత్మీయ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా రామరాజు మీడియాతో మాట్లాడుతూ ముఖ్య కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో వారి అభిప్రాయం తీసుకోవడం జరిగిందని, వారి అభిష్టం మేరకు స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేస్తానన్నారు. ప్రజల ఆశీర్వాదంతో తప్పకుండా గెలుస్తానన్నారు. బీఆరెస్‌ పార్టీలోనే ఉంటానని, సీఎం కేసీఆర్‌తో కొనసాగుతునే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని ఇందులో గందరగోళం అవసరం లేదన్నారు.

ఈ నియోజకవర్గం నుంచి ఇప్పటిదాకా గెలిచిన బీఆరెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డిగాని, కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేయనున్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిగాని స్థానికులు కాదన్నారు. తాను బీసీ సామాజికవర్గం వ్యక్తినని, స్థానికుడనని ఇదే నినాదంతో ప్రజల్లోకి వెలుతానన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల సహా అన్ని వర్గాల ప్రజలు తనను ఆశీర్వదిస్తారన్న నమ్మకం ఉందన్నారు.

గత 20ఏళ్లుగా ప్రజా సేవలో ఉన్న నా కుటుంబం కింది స్థాయి నుంచి వచ్చిందేనని, ప్రజాసేవకు ఆస్తులు అన్ని అమ్ముకోవడానికైనా సిద్ధమన్నారు. ఎవరి బెదిరింపులకు, ప్రలోభాలకు భయపడేది తలగ్గోది లేదన్నారు. భూపాల్‌రెడ్డి కోసం ఎన్నో అవమానాలు ఎదుర్కొని పనిచేశానని, అలాంటి నన్నే అతను రాజకీయంగా అణుగ తొక్కాలని చూశారన్నారు.

బీఆరెస్ టౌన్ పార్టీ అధ్యక్షుడిగా నన్ను సంప్రదించకుండానే నా పదవిని తొలగించారన్నారు. ఒక్కసారి అవకాశం అని గెలిచిన ఎమ్మెల్యే కంచర్ల నిత్యం ప్రజాసేవ చేస్తున్న నన్ను ఒక బీసీ నాయకుడని, గంగిరెడ్లోడని అవహేళన చేయడం ఆయన అగ్రకుల అహంకారానికి నిదర్శనమన్నారు. ఎమ్మెల్యే కంచర్లకు వ్యతిరేకంగా మెజార్టీ పార్టీ శ్రేణులు, తెలంగాణ ఉద్యమకారులు, నియోజకవర్గ ప్రజలు, అధికారులు ఉన్నారని, వారంతా ఎన్నికల్లో ఎమ్మెల్యేకు తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఎమ్మెల్యేకు తిరిగి టికెట్ ఇచ్చే విషయమై కూడా బీఆరెస్‌ పెద్ద నాయకులు ఎవరు సంప్రదించలేదన్నారు. తాను ఎవరి మాటలకు తలోగ్గే పరిస్థితి లేదని పోటీకి కట్టుబడి ఉన్నానన్నారు.

ఈ నియోజకవర్గం నుంచి నాలుగుసార్లు వరుసగా గెలిచి ఐదోసారి ఓడిపోగానే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నియోజకవర్గ ప్రజలను వారి కర్మకు వదిలేసి భువనగిరికి పారిపోయాడని, వారికి రాజకీయాలు తప్ప ప్రజలు అవసరం లేదన్నట్లుగా వ్యవహారించారని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో నల్లగొండ అసెంబ్లీ నియోజవర్గం నుంచి తొలిసారిగా స్థానిక, బీసీ అభ్యర్ధిగా బరిలో ఉండబోతున్న తనను గెలిపించడం ద్వారా నియోజవర్గం రాజకీయాల్లో, నాయకత్వంలో మార్పు తీసుకొచ్చేందుకు ప్రజలు సహకరించాలన్నారు.

Exit mobile version