Site icon vidhaatha

జనవరి 22 కోసం ప్రపంచమంతా ఎదురుచూస్తోంది: ప్రధాని మోడీ


విధాత : శ్రీరామ మందిరం ప్రారంభోత్సవం జనవరి 22కోసం ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తుందని, ఆధునిక అయోధ్యకు అంకురార్పణ జరుగనుందని, దేశ చరిత్ర చిత్రపటంలో అయోధ్యకు సగర్వ స్థానంలో నిలపబోతున్నామని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. శనివారం అయోధ్య పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ 15,700కోట్ల పనులకు శంకుస్థాపనలు చేశారు. ఆధునిక హంగులు, రామ మందిర చిత్రాలతో అభివృద్ధి చేసిన అయోధ్య అక్షర థామ్‌ రైల్వే స్టేషన్‌ను, రెండు అమృత్ భారత్‌, ఆరు వందే భారత్ రైళ్లను యూపీ సీఎం యోగి ఆధిత్యనాథ్‌, రైల్వే మంత్రి అశ్విని శ్రీ వైష్ణవ్‌తో కలిసి ప్రారంభించారు. అమృత్ భారత్ రైలులో కొద్ధిసేపు విద్యార్థులతో కలిసి ప్రయాణించారు.


అనంతరం వాల్మీకి ఇంటర్నేషన్ ఏయిర్ పోర్టును ప్రారంభించారు. రైల్వే స్టేషన్ నుంచి ఏయిర్ పోర్టు వరకు 15కిలోమీటర్ల కొనసాగిన మోడీ రోడ్‌షోకు ప్రజలు దారికి ఇరువైపుల పూల వర్షం కురిపిస్తూ ఘన స్వాగతం పలికారు. దారి వెంట సీతారామలక్ష్మణ, హనుమంత్ వేషధారణలతో రామాయణ విశేషాలతో కూడిన ప్రదర్శనలు, దేశ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా పలు సాంస్కృతిక ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. అనంతరం ఏయిర్ పోర్టు సమీపంలో ఏర్పాటు చేసిన జన్ సభలో ప్రధాని మోడీ ప్రసంగించారు.PM Modi,Maharshi Valmiki Airport, Ayodhya,railway station, Lord Ram Mandir,Ayodhya Ram Mandir, Pm Narendra Modi


 


ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ అయోధ్య నగర వాసులతో పాటు నేను కూడా శ్రీరామమందిరం ప్రారంభోత్సవం, శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టాపనోత్సవ మహత్కార్యం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నామన్నారు. వందల ఏళ్లు ఎదురుచూసిన కల జనవరి 22న నెరవేరబోతున్న మహత్తర ఘట్టం కోసం ప్రపంచం అంతా ఎదురు చూస్తోందని, అందుకోసం ఆధునిక అయోధ్యకు అంకురార్పణ జరిగిందని స్పష్టం చేశారు. దేశం అభివృద్ధి పరంగా ఎంత వేగంగా దూసుకెళ్లినా సరే తమ సంస్కృతినీ కాపాడుకోవాలన్నారు.


ఇన్నాళ్లూ అయోధ్య రాముడు ఓ చిన్న టెంట్‌లో ఉండిపోయాడని, ఇప్పుడు ఆయన కోసం భవ్య, దివ్య మందిరమే కట్టామన్నారు. దేశ, విదేశాల నుంచి భవిష్యత్తులో అయోధ్యకు వచ్చే యాత్రికుల కోసం అయోధ్య నగరాన్ని అన్ని వసతులతో అభివృద్ధి చేస్తున్నామన్నారు. అయోధ్యలో కొత్త టౌన్ షిప్ నిర్మాణం జరుగుతుందన్నారు. ఇది అయోధ్య వాసుల కష్టాలకు తగ్గ ఫలితమన్నారు. వారసత్వం మనకు సరైన మార్గం చూపుతుందన్నారు. భారతదేశం ఆలయాల పునర్నిర్మాణాలతో పాటు అభివృద్ధిలోనూ దూసుకుపోతుందన్నారు. మొత్తం యూపీ అభివృద్ధికి అయోధ్య స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు.


చుట్టుపక్కల ప్రాంతాలతో కూడా అయోధ్యను అనుసంధానం చేస్తున్నారన్నారు. ఎయిర్ పోర్టులో అడుగుపెట్టే ప్రతి ఒక్కరూ మహర్షి వాల్మీకిని స్మరించుకుంటారన్నారు. రైల్వే స్టేషన్ అభివృద్ధి పూర్తయ్యాక ప్రతిరోజు 70,000 మంది సందర్శిస్తారన్నారు. సరయు తీరంలో కొత్త ఘాట్‌ల నిర్మాణంతో పాటు పాత ఘాట్‌ల పునర్నిర్మాణం జరుగుతుందన్నారు.


వందే భారత్, నమో భారత్, తర్వాత అమృత్‌ భారత్ రైళ్లను ప్రారంభిస్తున్నామని, తొలి అమృత్‌ భారత రైలు అయోధ్య నుంచి ప్రయాణిస్తుందన్నారు. దేశంలోని అన్ని ప్రసిద్ధి నగరాలు, ఆలయాలను అనుసంధానిస్తూ రహదారులు, రైళ్లు, విమాన వసతులు కల్పిస్తున్నామన్నారు. ఇప్పటికే దేశంలోని ప్రసిద్ధ అక్షర్‌థామ్‌, చార్ థామ్, అమర్‌నాథ్‌, కైలాస్ నాథ్‌, మానస్ సరోవర్ వంటి యాత్రలు నిర్వహిస్తున్నామని, అదే రీతిలో అయోధ్య థామ్ యాత్ర కొనసాగనుందన్నారు.

 

దేశంలో తొలి అమృత్ భారత్ రైళ్లను అయోధ్యలో ప్రధాని మోడీ ప్రారంభించారు. ఈ రైలు ఎక్స్‌ప్రెస్ నాన్ ఏసీ పుష్‌ఫుల్ రైలు. తక్కువ సమయంలో ఎక్కువ వేగం అందుకునే ఈ రైలు గరిష్ఠంగా 130కిలోమీటర్ల వేగంతో ప్రయాణించనుండటంతో ప్రయాణికుల సమయం ఆదాకానుంది. ఇందులో 22కోచ్‌లు, 12సెకండ్ కాల్స్ త్రీటైర్ స్లీపర్, 8జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు, రెండు గార్డు కంపార్టుమెంట్లు ఉంటాయి. ఈ రెండు కంపార్టుమెంట్లలో మహిళలకు, దివ్యాంగులకు ప్రత్యేకంగా కేటయించారు.

Exit mobile version