286 kg Golden Bow Gifted To Ayodhya Ram | ఆయోధ్య రాముడికి అరుదైన ‘పంచలోహ ‘విల్లు’

అయోధ్య రామయ్యకు 286 కిలోల భారీ ‘పంచలోహ విల్లు’! ఒడిశా నుంచి రామమందిరానికి చేరిన అరుదైన కానుక. 40 మంది మహిళా కళాకారుల 8 నెలల కృషి.. పూర్తి వివరాలు ఇక్కడ..

286 kg Panchaloha bow gifted to Ayodhya Ram

విధాత : అనేక ప్రత్యేకతల మధ్య పునర్ నిర్మితమైన చారిత్రాత్మక రామజన్మభూమి అయోధ్య రామమందిరం మరో విశేషానికి వేదిక కాబోతుంది. అయోధ్య బాలరాముడికి విశేష ఉత్సవ వేళల్లో ధరింప చేసేందుకు ప్రత్యేకతంగా రూపొందించిన 286 కిలోల ‘పంచలోహ ‘విల్లు’ గురువారం అయోధ్యకు చేరుకుంది. అయోధ్య రామాలయానికి భక్తులు వివిధ విలువైన కానుకలను సమర్పిస్తున్నారు. వాటిలో బంగారు విగ్రహాలు, కిరీటాలు, ఇతర అలంకరణ వస్తువులు ఉన్నాయి. తాజాగా ఒరిస్సాకు చెందిన భక్తులు ఈ అరుదైన స్వర్ణ పంచలోహ విల్లును సమర్పించారు. తమిళనాడుకు చెందిన 48 మంది మహిళా కళాకారులు 8 నెలల పాటు శ్రమించి దీనిని రూపొందించారు. దీని తయారీకి సుమారు రూ.1.10 కోట్లు ఖర్చయినట్లు అంచనా.

బంగారం, వెండి సహా 5 లోహాలతో తయారైన ఈ ధనుస్సుపై కార్గిల్ యుద్ధవీరుల గాథలు, భారత సైన్య పరాక్రమ చిహ్నాలను చెక్కడం విశేషం. విశిష్టమైన ఈ కొదండరాముడి విల్లును ఆధ్యాత్మికతతో పాటు జాతీయవాదానికి ప్రతీకగా నిలిచేలా రూపొందించారు.
ఒడిశాలోని రూర్కెలా నుంచి జనవరి 3న ప్రారంభమైన ‘పంచలోహ విల్లు’ శోభాయాత్ర అయోధ్యకు చేరడంతో ముగిసింది. విష్ణువు, శ్రీరాముడి దివ్య విల్లు పేరు ‘శారంగ’ గా పిలుస్తారు. దక్షిణాన ‘కోదండ’ గా ప్రాచుర్యంలో ఉంది. రాముడి విల్లును ధర్మ, విజయ ప్రతీకగా కొలుస్తారు. అంతకుముందు గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన వజ్రాల వ్యాపారి రామ్ లల్లా విగ్రహానికి అమర్చేందుకు రూ.11కోట్ల విలువైన వజ్రాలు, బంగారంతో రూపొందించిన ‘ముకుట్’ (కిరీటం) విరాళంగా ఇచ్చారు. అంతకుముందు చెన్నై నుండి 2.5 కిలోల విల్లును సమర్పించారు.

ఇవి కూడా చదవండి :

Phone Tapping Case | ఫోన్‌ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్…త్వరలో కేసీఆర్ కు నోటీసులు?

Latest News