తేజస్‌ యుద్ద విమానంలో ప్రధాని మోడీ

ప్రధాని నరేంద్ర మోడీ తేజ‌స్ యుద్ధ విమానంలో ప్రయాణించారు. శనివారం బెంగుళూరులో యుద్ద విమానాల తయారీ కేంద్రం హెచ్ఏఎల్ సెంట‌ర్‌కు వెళ్లిన ప్రధాని మోడీ అక్క‌డ త‌యారీ అవుతున్న యుద్ధ విమానాలు, హెలికాప్ట‌ర్ల గురించి తెలుసుకున్నారు

  • Publish Date - November 25, 2023 / 07:50 AM IST

విధాత : ప్రధాని నరేంద్ర మోడీ తేజ‌స్ యుద్ధ విమానంలో ప్రయాణించారు. శనివారం బెంగుళూరులో యుద్ద విమానాల తయారీ కేంద్రం హెచ్ఏఎల్ సెంట‌ర్‌కు వెళ్లిన ప్రధాని మోడీ అక్క‌డ త‌యారీ అవుతున్న యుద్ధ విమానాలు, హెలికాప్ట‌ర్ల గురించి తెలుసుకున్నారు. తేజ‌స్ త‌యారీ కేంద్రాన్ని కూడా ఆయ‌న విజిట్ చేశారు. పూర్తిగా స్వ‌దేశీ ప‌రిజ్ఞానంతో అభివృద్ధి చేసిన తేజ‌స్‌ తయారీ గూర్చి తెలుసుకుని, అందులో ప్రయాణించారు. తేజ‌స్ యుద్ధ విమానంలో తాను విజయవంతంగా ప్రయాణించినట్లుగా ప్ర‌ధాని మోదీ తెలిపారు.


కాగా.. ఆయ‌న త‌న ఎక్స్ అకౌంట్‌లో ఈ విష‌యాన్ని పోస్టు చేశారు. అనుభూతి అద్భుతంగా ఉంద‌న్నారు. స్వ‌దేశీ సామ‌ర్థ్యాన్ని పెంచాల‌న్న త‌న న‌మ్మ‌కానికి బ‌లం చేకూరిన‌ట్లు ఉంద‌న్నారు. భార‌త స‌త్తా ప‌ట్ల గ‌ర్వంగా ఉంద‌న్నారు. వాయుసేన, హిందుస్తాన్‌ ఎరోనాటిక్స్‌, డీఆర్‌డీవోలను అభినందించారు. హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సంస్థ‌.. తేజ‌స్ యుద్ధ విమానాల‌ను త‌యారు చేస్తున్నది. లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్‌గా వాటికి గుర్తింపు ఉన్న‌ది. అమెరికాకు చెందిన జీఈ ఏరోస్పేస్ సంస్థ‌తో హిందుస్థాన్ సంస్థ ఒప్పందం కుదుర్చుకున్న‌ది. తేజ‌స్ విమానాల‌కు చెందిన‌ మాక్‌-3 ఇంజిన్ల‌ను హెచ్ఏఎల్ ఉత్ప‌త్తి చేస్తోంది.

Latest News