Nalgonda | హత్య చేసి.. గుండె పోటుగా చిత్రించే ప్రయత్నం

Nalgonda పోస్టుమార్టం నివేదికతో నిందితుడి అరెస్టు విధాత: భార్యను తలపై కొట్టి హత్య చేసి గుండెపోటుతో చనిపోయినట్లుగా అందరిని నమ్మించే క్రమంలో భర్త చేసిన దుర్మార్గం పోస్టుమార్టం నివేదికలో వెలుగు చూడటంతో పోలీసులు నిందితుడు ఎడవెల్లి వల్లబ్‌ రెడ్డిని అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే నల్గొండ జిల్లా నిడమనూరుకు చెందిన కాంగ్రెస్ నాయకుడు ఎడవెల్లి రంగసాయి రెడ్డి కుమారుడు వల్లబ్ రెడ్డికి, అంబర్‌ పేట జైస్వాల్‌ గార్డెన్‌కు చెందిన కోటి జైపాల్‌రెడ్డి పెద్ద కూతురు లహరి(27)కి ఏడాది […]

  • Publish Date - July 29, 2023 / 01:11 AM IST

Nalgonda

  • పోస్టుమార్టం నివేదికతో నిందితుడి అరెస్టు

విధాత: భార్యను తలపై కొట్టి హత్య చేసి గుండెపోటుతో చనిపోయినట్లుగా అందరిని నమ్మించే క్రమంలో భర్త చేసిన దుర్మార్గం పోస్టుమార్టం నివేదికలో వెలుగు చూడటంతో పోలీసులు నిందితుడు ఎడవెల్లి వల్లబ్‌ రెడ్డిని అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే నల్గొండ జిల్లా నిడమనూరుకు చెందిన కాంగ్రెస్ నాయకుడు ఎడవెల్లి రంగసాయి రెడ్డి కుమారుడు వల్లబ్ రెడ్డికి, అంబర్‌ పేట జైస్వాల్‌ గార్డెన్‌కు చెందిన కోటి జైపాల్‌రెడ్డి పెద్ద కూతురు లహరి(27)కి ఏడాది క్రితం వివాహామైంది. వారు హిమాయత్ నగర్లో నివాసం ఉంటున్నారు.

కొంత కాలంగా భార్య భర్తల మధ్య కొన్నిరోజులుగా మనస్పర్థలు నెలకొన్నాయి. ఈ నెల 13న రాత్రి లహరిని తీవ్రంగా కొట్టిన వల్లబ్ రెడ్డి ఆమె తలను గోడకు, తలుపుకు బాదాడు. పొట్టలో కాలుతో వల్లబ్‌ రెడ్డి లహరిని బలంగా తన్నడంతో రెండున్నర లీటర్ల బ్లడ్ బ్లీడింగ్ జరిగింది. ఎవరికీ అనుమానం రాకుండా హార్ట్ ఎటాక్ పేరుతో భార్య లహరిని ఆస్పత్రిలో వల్లబ్‌ రెడ్డి అడ్మిట్‌ చేశారు. చికి్త్స పొందుతు ఆమె చనిపోగా గుండెపోటుతో చనిపోయినట్లుగా అందరిని నమ్మించే ప్రయత్నం చేశాడు.

విషయం తెలియని లహరి తల్లిదండ్రులు తమ ఫిర్యాదులో తమ కూతురు తలపై గాయలున్నప్పటికి అల్లుడు వల్లబ్‌రెడ్డినే కొట్టి చంపినట్లుగా పోలీసుల ఫిర్యాదులో పేర్కోనలేదు. ఇందుకు వల్లబ్‌రెడ్డి వారిని బెదిరించి ఉండవచ్చని కూడా అనుమానిస్తున్నారు. ఈ నెల 24న భార్య దినకర్మ కు 10వేల మందికి భోజనాలు పెట్టి ఏమీ తెలియనట్లు భర్త వల్లబ్ రెడ్డి అందరిని నమ్మించేశాడు. అటు పోస్టుమార్టం సమయంలోనూ నల్లగొండ జిల్లాకు చెందిన ఓ బీఆరెస్‌ ఎమ్మెల్యే మూడుగంటల పాటు అక్కడే ఉన్నాడని, కేసును తారుమారు చేసి నిందితుడు వల్లబ్‌రెడ్డిని తప్పించే ప్రయత్నం చేశారని సమాచారం.

అయితే పోస్టుమార్టం రిపోర్టులో లహరిది సహజ మరణం కాదని, వల్లబ్ కొట్టడంతోనే లహరి చనిపోయినట్లు వైద్యులు తేల్చడంతో కేసు సరైన మలుపు తిరిగింది. నిజం తెలుసుకున్న లహరి తల్లిదండ్రులు కూడా అల్లుడి వల్లబ్‌రెడ్డి, అతని తండ్రి రంగశాయిరెడ్డిపై మరో ఫిర్యాదు చేశారు. అటు పోస్టుమార్టం నివేదికతో వల్లబ్ నిందితుడుగా తేలడంతో అతనిపై సెక్షన్ 302 మర్డర్, 201 సాక్షాల తారుమారు కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి రిమాండుకు తరలించినట్లుగా నారాయణగూడ స్టేషన్ హౌజ్ ఆఫీసర్ శ్రీనివాస్ వెల్లడించారు. రంగశాయిరెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు.

Latest News