Site icon vidhaatha

Pragyan Rover | చంద్రునిపై సల్ఫర్‌ నిక్షేపాలు.. మరో పద్ధతిలోనూ దృవీకరించిన ప్రజ్ఞ

Pragyan Rover |

బెంగళూరు: చంద్రుని దక్షిణ ధ్రువంపై సల్ఫర్‌, ఇతర ఖనిజ నిక్షేపాలు ఉన్నాయని ఇప్పటికే గుర్తించిన ప్రజ్ఞ రోవర్‌ మరో సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి.. దానిని ఖరారు చేసింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఈ విషయాన్ని ప్రకటించింది.

ప్రజ్ఞ రోవర్‌కు ఉన్న లేజర్‌-ఇండ్యూస్డ్‌ బ్రేక్‌డౌన్‌ స్పెక్టోస్కోప్‌ (ఎల్‌ఐబీఎస్‌) సల్ఫర్‌ ఉనికిని గుర్తించడంలో కీలకంగా వ్యవహరించింది. ఎల్‌ఐబీఎస్‌ అన్వేషణను మరొక ఆన్‌బోర్డ్‌ పరికరం ఆల్ఫా పార్టికిల్‌ ఎక్స్‌ రే స్పెక్ట్రోస్కోప్‌ (ఏపీఎక్స్‌ఎస్‌) సల్ఫర్‌తోపాటు.. ఇతర కొన్ని నిక్షేపాలు ఉన్నట్టు విస్పష్టంగా ధ్రువీకరించింది.

చంద్రయాన్‌-3 కనుగొన్న ఈ విషయాలతో చంద్రునిపై ఉన్న సల్ఫర్‌కు మూలం అంతర్గతమా? అగ్నిపర్వతాల విస్ఫోటమా? లేక ఉల్కాపాతమా? అనే అంశంలో తాజా పరిశోధనలకు శాస్త్రవేత్తలకు అవకాశం కలుగుతుంది.

Exit mobile version