నాచురల్ స్టార్ నాని (Nani) హీరోగా వరుస విజయాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. అయితే నిర్మాతగా వ్యవహరిస్తున్న ఆయన తాజాగా ప్రియదర్శి (Priyadarshi), హర్ష్ రోషన్, శ్రీదేవి ప్రధాన పాత్రల్లో నిర్మిస్తున్న నూతన చిత్రం కోర్ట్ (Court). రామ్ జగదీశ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉండగా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజాగా ఈ చిత్రం నుంచి ప్రేమలో అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఈ పాటకు పూర్ణాచారి లిరిక్స్ అందించగా విజయ్ బుల్గానిన్ సంగీతం అందించాడు. అనురాగ్ కులకర్ణి (Anurag Kulakarni), సమీరా భరద్వాజ్(Sameera Bharadwaj) ఆలపించారు.