Site icon vidhaatha

President Draupadi Murmu | జూలై 4న హైదరాబాద్‌కు రాష్ట్రపతి ముర్ము

President Draupadi Murmu |

విధాత : జూలై 4న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్‌కు రానున్నారు. రాష్ట్రపతి రానున్న నేపథ్యంలో ఏర్పాట్లపై సీఎస్‌ శాంతి కుమారీ అధికారులతో సమీక్షించారు.

సోమవారం డా.బీఆర్‌ అంబేద్కర్‌ సచివాలయంలో రాష్ట్రపతి పర్యటన వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించిన సీఎస్‌ జూలై 4న అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల్లో రాష్ట్రపతి పాల్గొంటారని తెలిపారు. ప్రొటోకాల్‌ ప్రకారం ఎలాంటి లోటుపాట్లకు అవకాశం ఇవ్వకుండ ఏర్పాట్లు చేయాలన్నారు.

Exit mobile version