కాంగ్రెస్‌తోనే ప్రజా పాలన: ప్రియాంక గాంధీ

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే ప్రజా పాలన సాధ్యమవుతుందని ప్రజలు పదేళ్ల మోసపూరిత బీఆరెస్ ప్రభుత్వాన్ని గద్దె దించి, ఆరు గ్యారంటీల ప్రజా ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకగాంధీ పిలుపునిచ్చారు

  • Publish Date - November 27, 2023 / 08:42 AM IST
  • బీఆరెస్ ఆశలన్ని పోల్ మేనేజ్‌మెంట్‌పైనే
  • మోసాల బీఆరెస్ ప్రభుత్వాన్ని దించండి
  • ఆరుగ్యారంటీల ప్రజా ప్రభుత్వాన్ని ఎన్నుకోండి
  • భువనగిరిలో ప్రియాంక గాంధీ


విధాత : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే ప్రజా పాలన సాధ్యమవుతుందని ప్రజలు పదేళ్ల మోసపూరిత బీఆరెస్ ప్రభుత్వాన్ని గద్దె దించి, ఆరు గ్యారంటీల ప్రజా ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకగాంధీ పిలుపునిచ్చారు. సోమవారం భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థి కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి ఎన్నికల ప్రచార సభలో ఆమె మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం వస్తే తమ బతుకులు బాగుపడుతాయని ప్రాణ త్యాగాలతో విద్యార్థులు, యువతీయువకులు తెలంగాణ కోసం పోరాటం చేశారన్నారు. ఎన్నో వ్యయప్రయాసలతో ఉద్యోగాల కోసం పరీక్షలు రాస్తే ప్రశ్నపత్రాలను లీక్ చేసి బీఆరెస్ ప్రభుత్వం వారి జీవితాలను ఆగం చేసిందన్నారు.


బీఆరెస్ పాలనలో అంతా అవినీతి మయమైందన్నారు. కాళేశ్వరం, ఆర్‌ఆర్‌ఆర్ ప్రాజెక్టులలో జరిగిన అవినీతి మీకందరికి తెలుసన్నారు. బీఆరెస్ నాయకులంతా ధనవంతులైతే మీరంతా పేద వారయ్యారన్నారు. బీజేపీ, బీఆరెస్‌ల ముఖ్య ఉద్దేశం అధికారం కోసమే తప్ప ప్రజలు, పేదల సంక్షేమం పట్టించుకోవడం లేదన్నారు. బీఆరెస్ పార్టీకి ప్రజా పాలన కంటే పోల్ మేనేజ్‌మెంట్ బాగా చేస్తారని విమర్శించారు. పోల్ మేనేజ్‌మెంట్‌తో మాయమాటలతో బీఆరెస్ ఎన్నికల్లో గెలవడం అలవాటుగా పెట్టుకుందన్నారు. ఈ సారి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కోసం మీ ఓటును అమ్ముకోకుండా బీఆరెస్‌ను ఓడించి ఆ పార్టీకి గుణపాఠం చెప్పాలన్నారు.


తెలంగాణ ప్రజలు ఈ ఎన్నికల్లో ఆరుగ్యారంటీల ప్రజా ప్రభుత్వం కావాలా..మళ్లీ మిమ్మల్ని మోసం చేసే దొరల తెలంగాణ బీఆరెస్‌పాలన కావాలో ఆలోచించాలన్నారు. పదేళ్లుగా బీఆరెస్ ప్రభుత్వం ప్రజలకు ఏమి చేయలేదన్నారు. వారి ఆస్తులు పెంచుకోవడం తప్ప ప్రజల అభివృద్ధి పట్టించుకోలేదన్నారు. పదేళ్లుగా సీఎం కేసీఆర్‌ ఫామ్‌హౌజ్‌కే పరిమితమై ప్రజా పాలనను నిర్లక్ష్యం చేశారన్నారు. మళ్లీ బీఆర్ఎస్ వస్తే భూమాఫియా, లిక్కర్ మాఫీయా, ఉద్యోగ పరీక్షల పేపర్ల లీకేజీలు కొనసాగుతాయన్నారు. బీఆరెస్ పాలనలో అవినీతి అకాశాన్నింటుతుందని, పేదలకు ఇండ్లు రావన్నారు. బీఆరెస్ పార్టీ వస్తే ధరణి పోర్టల్ పేరుతో మీ భూములు లాక్కుంటారన్నారు. మన అక్క చెళెళ్ల్ల మీద అత్యాచారాలు ఆగవన్నారు.


తెలంగాణ మరింత వెనుకబడి పోయి ప్రజల బతుకులు దుర్భరమవుతాయన్నారు. అప్పు పదింతలు పెరుగుతుందని, దళిత, గిరిజనలకు వారి హక్కులు వారికి ఉండవన్నారు. మళ్లీ బీఆరెస్ వస్తే తెలంగాణ దొరల తెలంగాణ అవుతుందేగాని ప్రజల తెలంగాణ కాదన్నారు. కాంగ్రెస్ పార్టీ వస్తే ప్రజా ప్రభుత్వం వస్తుందన్నారు. కాంగ్రెస్ వస్తే రాజస్తాన్‌, చత్తీస్ ఘడ్‌ల మాదిరిగా ఉద్యోగాలిస్తామన్నారు. మళ్లీ మీ అందరి జీవితాల్లో వెలుగు నింపుతుందన్నారు. ఇండ్లు లేని వారికి ఇంటి స్థలం, ఇండ్లు నిర్మిస్తామన్నారు.


ఆరు గ్యారంటీలతో అక్కా చెల్లెళ్లకు ప్రతినెల 2,500వస్తాయని, ఉచిత బస్సు ప్రయాణం, 200యూనిట్ల ఉచిత గృహ విద్యుత్తు, రైతులకు ఉచిత కరెంటు, 2లక్షల రుణమాఫీ, 500బోనస్‌, పెద్దలకు 4వేల పెన్షన్‌, జాబ్ క్యాలెండర్‌తో ఉద్యోగాలిస్తామన్నారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో పేదల సంక్షేమంతో కూడిన పాలన అందిస్తామన్నారు. తెలంగాణ ప్రజలు పేదల సంక్షేమానికి పనిచేసిన ఇందిరా, సోనియాలను అభిమానిస్తారన్నారు. తెలంగాణ ఎన్నికల్లో ఒకపక్క ఫామ్‌హౌజ్‌లు, భవంతులతో వేలకోట్ల అవినీతికి పాల్పడిన బీఆరెస్‌, ఇంకోవైపు ప్రజాపాలన అందించే కాంగ్రెస్ ఉందనాన్నారు. అలాగే ధనితుల కోసం పనిచేసే బీజేపీ, బీఆరెస్‌లు, వారికి వంతపాడే ఎంఐంఎలు ఒక పక్క, పేదల కోసం పనిచేసే కాంగ్రెస్ ఇంకోపక్క ఉందన్నారు.


రాహుల్ గాంధీ మీద తరుచు ఒవైసీ విమర్శలు చేస్తుంటాడని, కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు జనాదరణ ఉన్న రాహుల్‌ను విమర్శించే స్థాయి ఒవైసీకి లేదన్నారు. తెలంగాణలో మాత్రం 9సీట్లలో పోటీ చేసే ఎంఐఎం బీజేపీకి మేలు చేసేందుకు ఇతర రాష్ట్రాల్లో 40-50సీట్లలో పోటీ చేస్తుందని విమర్శించారు. పో. ఆ ముగ్గురు ఒక్కరేనన్నారు. ఆ ముగ్గురు ఒకవైపు…భష్టాచర్‌, రెండోవైపు సత్యాయిక రాజనీటి, వాళ్లు పదేళ్లుగా ధనవంతమైన పార్టీగా, బీఆరెస్ కూడా అన్ని పార్టీల కంటే సంపన్న పార్టీగా మారిందన్నారు. తెలంగాణలో మార్పు కావాలి..కాంగ్రెస్ రావాలి అని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలను, ఎన్నికల హామీలు అమలు చేస్తామన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించి తెలంగాణ ప్రజలు మార్పు తీసుకరావాలన్నారు.