Gitanjali Aiyar | భారత్‌లో తొలితరం మహిళా ఆంగ్ల న్యూస్ ప్రజెంటర్లలో ఒకరైన గీతాంజలి అయ్యర్ ఇకలేరు. దూరదర్శన్ చానెల్‌లో సుదీర్ఘ కాలం న్యూస్ రీడర్‌గా పని చేసిన గీతాంజలి జూన్ 7వ తేదీన కన్నుమూసినట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు.
గత కొంతకాలంగా పార్కిన్సన్ వ్యాధితో బాధపడుతున్న ఆమె.. బుధవారం ఒక్కసారిగా కుప్పకూలి తుదిశ్వాస విడిచారు. గీతాంజలి అయ్యర్ మృతి పట్ల ఆయా సంస్థల మీడియా ప్రతినిధులు, రాజకీయ నాయకులు నివాళులర్పించారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
కోల్‌కతాలోని లోరెటో కాలేజీలో గీతాంజలి గ్రాడ్యుయేట్ పూర్తి చేశారు. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో డిప్లొమా కోర్సు చేశారు. ఖాన్‌దాన్ సిరీయల్‌లో కూడా ఆమె నటించి అందరిని మెప్పించారు. కాన్ఫిడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీకి కన్సల్టెంట్‌గా కూడా పని చేశారు.