Site icon vidhaatha

Gandhi Bhavan: గాంధీభవన్ లోకి గొర్రెల మందతో నిరసన!

విధాత, హైదరాబాద్ : తెలంగాణ కేబినెట్ లో యాదవ సామాజిక వర్గం ఎమ్మెల్యేలకు స్థానం కల్పించాలని కోరుతు సోమవారం వినూత్న నిరసనకు దిగారు. గొర్రెల కాపరుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీ భవన్ లోకి గొర్రెలను పంపి వినూత్నంగా నిరసన తెలిపారు. కేబినెట్ లో యాదవుకు చోటు కల్పించాలని..అలాగే పీసీసీ కార్యవర్గంలో యాదవ్ లకు ప్రాధాన్యత పెంచాలని వారు డిమాండ్ చేశారు. అయితే గొర్రెలను గాంధీభవన్ లోపలికి తీసుకెళ్లకుండా పోలీసులు వాటిని ప్రాంగణంలోనే అడ్డుకున్నారు.

ఈ సందర్భంగా గొర్రెల కాపరుల సంక్షేమ సంఘం నాయకులకు, పోలీసులకు వాగ్వివాదం చోటుచేసుకుంది. నిరసన కారులు కేబినెట్ లో యాదవులకు స్థాకం కల్పించాలని డిమాండ్ చేస్తు నినాదాలు చేశారు. పోలీసులు వారిని బలవంతంగా అక్కడి నుంచి పంపించివేశారు.

అనంతరం నిరసన చేపట్టిన యాదవ నాయకులతో పీసీసీ చీఫ్ బి.మహేష్ కుమార్ గౌడ్ చర్చించారు. గొల్ల, కురుమల అవేదనను అర్ధం చేసుకున్నామని..మంత్రివర్గంలో స్థానం విషయమై హైకమాండ్ కు నివేదిక పంపిస్తామన్నారు. ఈనెలాఖరులో చేపట్టే కార్పొరేషన్ లో గొల్ల కురుమలకు అవకాశం ఉంటుందని.. లోకల్ బాడీ ఎన్నికల్లో గొల్ల కురుమలకు జనాభా థామాషా ప్రకారం అవకాశాలు ఇస్తామని తెలిపారు. యాదవ సామాజిక వర్గానికి చెందిన అనీల్ యాదవ్ కు హైకమాండ్ రాజ్యసభ అవకాశం ఇచ్చిందన్న సంగతి మరువరాదన్నారు.

Exit mobile version