RABBIT
విధాత: రోడ్డు మీద ఎవరైనా పడిపోతేనే మనకెందుకు అని వదిలేసే రోజులివి. అదే సమయంలో జంతువులు తమ తోటి ప్రాణులకు సాయం చేసే ఉదంతాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. అదీ తమ జాతి జంతువు కాకుండా తమను వేటాడటానికి ఇష్టపడే ఓ ప్రాణిని రక్షించడం గొప్ప విషయమే కదా.
తాజాగా అలాంటి వీడియోనే బయటకు వచ్చింది. దారి లేక ఓ రేకుల గోడ వెనకాల చిక్కుకుపోయిన పిల్లిని చూసిన కుందేలు. గోడ కింద గుంత తీసి దారి చూపింది. ఆఖరికి అది బయటకొచ్చే సమయానికి ముందు జాగ్రత్త చర్యగా కుందేలు దూరంగా పారిపోయింది. బయటకొచ్చిన మార్జాలం బిక్కమొహంతో అటూ ఇటూ చూసి తన దారిన వెళ్లిపోయింది.