రాడిసన్‌కు గోవా నుంచి డ్రగ్స్‌.. పోలీసుల విచారణలో వెల్లడి

గచ్చిబౌలి రాడిసన్ బ్లూ హోటల్ డ్రగ్స్ కేసులో గోవా లింకులు బయటపడ్డాయి. గోవాకు చెందిన డ్రగ్ పెడ్లర్ అబ్ధుల్ నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్ సరఫరా జరిగినట్లుగా

  • Publish Date - March 3, 2024 / 10:42 AM IST

విధాత, హైదరాబాద్ : గచ్చిబౌలి రాడిసన్ బ్లూ హోటల్ డ్రగ్స్ కేసులో గోవా లింకులు బయటపడ్డాయి. గోవాకు చెందిన డ్రగ్ పెడ్లర్ అబ్ధుల్ నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్ సరఫరా జరిగినట్లుగా పోలీసుల విచారణలో వెల్లడైంది. అబ్ధుల్ నుంచి పెడ్లర్ రెహ్మన్‌, మీర్జా, అబ్బాస్‌, డ్రైవర్ ప్రవీణ్‌, వీవేకానందలకు డ్రగ్ సరఫరా జరిగినట్లుగా తేలింది. దీంతో పోలీసులు గోవా లింకులపై మరింత విస్తృతంగా దర్యాప్తు చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం డ్రగ్స్ వ్యాపారి అబ్ధుల్ గోవా జైలులో ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. అటు రాడిసన్ డ్రగ్ కేసులో టాలీవుడ్ డైరక్టర్ క్రిష్ నుంచి పోలీసులు సేకరించిన యూరిన్ శాంపిల్స్‌లో ఆయన డ్రగ్ తీసుకోలేనట్లుగా తేలింది. ఇక రక్త పరీక్షల నివేదిక రావాల్సివుంది. ఈ కేసులో ఇప్పటి వరకు 13మందిపై కేసు నమోదు చేశారు. హోటల్ మేనేజర్‌పై కూడా కొత్తగా కేసు నమోదు చేశారు. ఇక డైరక్టర్ క్రిష్ ముందస్తు బెయిల్ పిటిషన్ నేడు సోమవారం హైకోర్టులో విచారణకు రానుంది.