తొలి క్యాబినెట్ భేటీలోనే 6 గ్యారంటీల అమలు: రాహుల్ గాంధీ

తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ కు అధికారమిస్తే తొలి క్యాబినెట్ భేటీలోనే 6 గ్యారంటీల అమలు చేస్తామని ఏఐసీసీ అధినేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు

  • Publish Date - November 25, 2023 / 09:23 AM IST
  • బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఒక్కటే
  • కేసీఆర్, బీజేపీని తరిమికొట్టాలి
  • బోధన్ సభలో ఏఐసీసీ అధినేత రాహుల్ గాంధీ


విధాత, నిజామాబాద్: తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ కు అధికారమిస్తే తొలి క్యాబినెట్ భేటీలోనే 6 గ్యారంటీల అమలు చేస్తామని ఏఐసీసీ అధినేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. బోధన్ లో శనివారం కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన విజయభేరి యాత్ర సభలో రాహుల్ గాంధీ మాట్లాడారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఒక్కటేనని, పార్లమెంట్ లో బీజేపీ ఏబిల్లు పెట్టినా కేసీఆర్ మద్దతివ్వడాన్ని ప్రజలు గమనించాలన్నారు. మూడు బిల్లులకు బీఆరెస్ ఎంపీలు తలూపిన సందర్భాన్ని పార్లమెంట్ లో నేను కళ్ళారా చూసినానని చెప్పారు.


నేను దేశంలో బీజేపీతో పోరాడుతున్నాన్నారు. దిగమింగుకోలేని బీజేపీ తనపై 24 కేసులు పెట్టిందని విమర్శించారు. లోకసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని తీర్మానించి, తన సొంత భవనం ఖాళీ చేయించారని పేర్కొన్నారు. తెలంగాణ నా సొంత ఇల్లు అన్నారు. కేసీఆర్ మీద కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఒక్క కేసు కూడా పెట్ట లేదని, బీఆరెస్ కు పూర్తిగా సహకరిస్తున్నారని చెప్పారు. కేసీఆర్, బీజేపీని ఈ ఎన్నికల్లో తరిమికొట్టాలి పిలుపునిచ్చారు. కేంద్రంలో బీజేపీని, మోడీని ఓడించాలన్నారు. తెలంగాణలో కేసీఆర్, ఢిల్లీలో మోడీ రాజ్యమేలుతున్నారని అన్నారు.


కాంగ్రెస్ పార్టీ కారు టైర్లు పంచర్ చేసిందని, బీఆర్ఎస్ గాలి తీసిందన్నారు. ఢిల్లీకి వెళ్లి మోడీని పంచర్ చేస్తానని అన్నారు. ఇందిరకు తెలంగాణకు అండగా నిలబడిందని, నేను ఎప్పటికీ మర్చిపోలేనని చెప్పారు. ప్రజల తెలంగాణ తెచ్చుకుందామని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కౌలు రైతులకు రూ.12 వేలు, పేదలకు 200 యూనిట్ల విద్యుత్ ఫ్రీ, రైతులకు ప్రతి క్వింటాలుకు రూ.500 బోనస్, రైతుబంధు, రూ.5 లక్షలతో ఇందిరమ్మ ఇల్లు నిర్మిస్తాం, ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ తరహా స్కూల్, పింఛన్లు రూ.4 వేలకు పెంచుతామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు.