విధాత: కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ మంగళవారం హైదరాబాద్ నగరంలో ఆటోలో ప్రయాణించి ఎన్నికల ప్రచారంలో ప్రత్యేకంగా నిలిచారు. ఆటో డ్రైవర్లు, గిగ్ వర్కర్లు, పారిశుధ్య కార్మికులతో ఉదయం రాహుల్‌గాంధీ జూబ్లిహిల్స్‌లో భేటీ అయ్యారు. అనంతరం నాంపల్లి కాంగ్రెస్ రోడ్ షోకు హాజరు కావాల్సి ఉంది. అయితే రాహుల్ గాంధీ తనతో మాట్లాడిన ఆటో డ్రైవర్‌ను సిటీలో తన ఆటోలో తిప్పాలని కోరారు.
ఆటో డ్రైవర్ కూడా సంతోషంగా అంగీకరించి రాహు్‌లను ఆటోలో కూర్చోబెట్టుకొని కొద్దిసేపు పలు ప్రాంతాల్లో చక్కర్లు కొట్టించారు. రాహుల్ వెంట కాంగ్రెస్ సీనియర్ నాయకులు ప్రయాణించగా, వెనక భద్రత సిబ్బంది ఆయన ఆటోను అనుసరించారు. అంతకుముందు రాహుల్‌గాంధీ ఆటోడ్రైవర్లతో భేటీలో తాను కూడా ఖాకీ చొక్కా ధరించి ఆటోవాలగా మారిపోయి వారితో ఫోటోలు దిగారు. కాంగ్రెస్ అధికారంలో వచ్చాకా ఆటో, క్యాబ్ డ్రైవర్ల సమస్యలు పరిష్కరిస్తామని ఆయన వారికి హామీ ఇచ్చారు.