Rahul Gandhi | విబేధాలు ఉంటే పార్టీ ఇన్‌ఛార్జి లేదా నాతో మాత్ర‌మే మాట్లాడాలి: రాహుల్‌గాంధీ

Rahul Gandhi తెలంగాణ‌లో అధికారం మ‌న‌దే.. టి. కాంగ్రెస్ నేత‌ల‌పై సీరియస్‌ (న్యూఢిల్లీ నుంచి విధాత ప్ర‌త్యేక ప్ర‌తినిధి) తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కోసం ఏఏ నాయ‌కులు ఏం చేశారో అనే విష‌యం త‌న‌కు స్ప‌ష్టంగా తెలుస‌ని కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ అన్నారు. మంగళవారం ఏఐసీసీ కార్యాలయంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలతో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ఖర్గే సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి 21 మంది తెలంగాణ నేతలకు పిలుపు రావడంతో వారంతా ఢిల్లీకి […]

  • Publish Date - June 27, 2023 / 01:20 PM IST

Rahul Gandhi

  • తెలంగాణ‌లో అధికారం మ‌న‌దే..
  • టి. కాంగ్రెస్ నేత‌ల‌పై సీరియస్‌

(న్యూఢిల్లీ నుంచి విధాత ప్ర‌త్యేక ప్ర‌తినిధి)

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కోసం ఏఏ నాయ‌కులు ఏం చేశారో అనే విష‌యం త‌న‌కు స్ప‌ష్టంగా తెలుస‌ని కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ అన్నారు. మంగళవారం ఏఐసీసీ కార్యాలయంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలతో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ఖర్గే సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి 21 మంది తెలంగాణ నేతలకు పిలుపు రావడంతో వారంతా ఢిల్లీకి చేరుకున్నారు.

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (TPCC Chief Revanth Reddy), కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat Reddy), ఉత్తమ్ కుమార్‌రెడ్డి (Uttam kumar Reddy), మధు యాష్కీ (Madhu Yashki), వీహెచ్ హనుమంత‌రావు (VH), జగ్గారెడ్డి (Jagga reddy), సీతక్క(Seethakka), జీవన్ రెడ్డి (Jeevan Reddy), దుద్దిళ్ల‌ శ్రీధర్ బాబు (Sridhar Babu), రేణుకా చౌద‌రి (Renuka Chowdary) తదితర నేతలు హాజ‌ర‌య్యారు.

విబేధాలు ఉంటే పార్టీ ఇన్‌ఛార్జితో, లేదా నాతో మాత్ర‌మే మాట్లాడాల‌ని, ఎట్టి ప‌రిస్థితుల్లోనూ బ‌య‌ట మాట్లాడొద్ద‌ని రాహుల్‌గాంధీ కొంత‌మంది నాయ‌కులకు సీరియ‌స్ వార్నింగ్ ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. పార్టీ క్ర‌మ‌శిక్ష‌ణ‌ను ఉల్లంఘిస్తే క‌ఠిన చ‌ర్య‌లుంటాయ‌ని హెచ్చ‌రించిన‌ట్లు స‌మాచారం. రానున్న ఎన్నిక‌ల్లో అభ్య‌ర్థుల ఎంపిక అధిష్టాన‌మే చూసుకుంటుంద‌ని, పార్టీ గెలుపు కోసం అంద‌రూ ఐక్యంగా ప‌నిచేయాల‌ని సూచించారు.

తెలంగాణ‌లో కాంగ్రెస్ అధికారంలోకి వ‌స్తుంది: థాక్రే

తెలంగాణలో నేతలందరూ కలిసికట్టుగా పని చేస్తారని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్ మానిక్ రావ్ థాక్రే తెలిపారు. తెలంగాణ నేత‌ల‌తో ముగిసిన స్ట్రాట‌జీ స‌మావేశం అనంత‌రం ఆయ‌న మంగళవారం మీడియాతో మాట్లాడారు. రానున్న ఎన్నిక‌ల్లో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 100 శాతం ఏర్పడుతుందని ధీమా వ్యక్తం చేశారు.

తెలంగాణ కాంగ్రెస్ నేతలతో మల్లికార్జున ఖర్గే (Mallikharjuna Kharge) అధ్యక్షతన సమావేశంలో ప‌లు నిర్ణ‌యాలు తీసుకున్న‌ట్లు చెప్పారు. రాష్ట్రంలో చేపట్టే కార్యక్రమాలపై చర్చించినట్లు తెలిపారు. కేసీఆర్‌ ప్రభుత్వంపై (KCR Government) తెలంగాణ ప్రజలకు కోపంగా ఉన్నారన్నారు. పదేళ్ల తర్వాత కూడా ప్రజల జీవితాల్లో మార్పు రాలేదన్నారు.

తెలంగాణ ప్రజలను కేసీఆర్ కుటుంబం లూటీ చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేయాల్సిన అంశాలపై చర్చించామన్నారు. కాంగ్రెస్‌తో తెలంగాణ వికాస్ ఉంటుందని చెప్పారు. కేసీఆర్ (CM KCR), బీఆర్‌ఎస్ (BRS) అన్ని రాష్ట్రాలలో బీజేపీతో (BJP) జత కడుతుందని తెలిపారు. మహారాష్ట్రలో కూడా కాంగ్రెస్ గట్టిగా ఉన్న చోట బీజేపీకి లాభం చేసేలా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని మానిక్‌రావ్ థాక్రే విమర్శించారు.

తెలంగాణ‌లో ఎన్నిక‌ల కార్యాచ‌ర‌ణ మొద‌లైంది: రేవంత్‌

తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ ఎన్నిక‌ల కార్యాచ‌ర‌ణ మొద‌లైంద‌ని టిపిసిసి అధ్య‌క్షుడు రేవంత్‌రెడ్డి చెప్పారు. టీ కాంగ్రెస్ స్ట్రాటజీ మీటింగ్ అనంత‌రం ఆయ‌న ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. 120 రోజుల పాటు తెలంగాణ‌లో బీఆర్ ఎస్ అవినీతి, బిజేపి అధికార దుర్వినియోగాన్ని ఎండ‌గ‌డ‌తామ‌న్నారు. క‌ర్ణాట‌క ఫార్ములానే తెలంగాణ‌లో కూడా అమ‌లు చేయ‌బోతున్న‌ట్లు రేవంత్‌రెడ్డి వివ‌రించారు.

బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వ‌ర‌కు తెలంగాణ‌లో పార్టీ నిర్మాణంపై దృష్టి పెడ‌తామ‌న్నారు. తెలంగాణ లో అధికారంలోకి వ‌చ్చాక ప్ర‌జ‌ల‌కు ఏమేమి చేయాల‌నే దానిపై ప్ర‌ధానంగా చ‌ర్చ జ‌రిగింద‌న్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల గురించి ప్ర‌త్యేకంగా చ‌ర్చ చేసిన‌ట్లు తెలిపారు. తెలంగాణ‌లో కేసీఆర్ కుటుంబం అవినీతి ఆకాశానికి అంటింద‌ని, కాంగ్రెస్ నేత‌లంతా క‌లిసిక‌ట్టుగా ప‌నిచేసి బీఆర్ ఎస్‌ను గ‌ద్దె దింపుతామ‌ని చెప్పారు.

అంత‌ర్గ‌త క‌ల‌హాల‌పై చ‌ర్చ‌

ఈ స‌మావేశంలో పార్టీలో అంతర్గత కలహాలపై, కోవర్టుల ఆరోపణలపై నేతలు ప్రత్యేకంగా చర్చ జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది. ఘర్ వాపసీ, అపరేషన్ ఆకర్ష్, చేరికల అంశంపై కూడా సమావేశంలో చ‌ర్చించారు. కేసీఆర్ హటావో తెలంగాణ బచావో నినాదాన్ని ఎలా తీసుకెళ్లాలి అనే అంశంపై మంతనాలు జ‌రిగాయని స‌మాచారం. రాహుల్, ప్రియాంక (Priyanka Gandhi), ఖర్గే రాష్ట్ర పర్యటనల షెడ్యూల్‌ను నేతలు ఖరారు చేసిన‌ట్లు చెబుతున్నారు.

Latest News