విధాత: సోమేశ్‌కుమార్‌పై హైకోర్టు తీర్పు నేపథ్యంలో సీనియారిటీ జాబితాలో ముందు వరుసలో ఉన్న రామకృష్ణరావును తాత్కాలిక సీఎస్‌గా నియమించే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఒక అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
12లోగా ఏపీకి రిపోర్టు చేయండి.. CS సోమేశ్‌ను ఆదేశించిన కేంద్రం
తెలంగాణ క్యాడర్‌కు కేటాయించబడిన రామకృష్ణారావుకు పరిపాలన వ్యవహారాల్లో కూడా అనుభవం ఉందంటున్నారు. కేంద్ర ప్రభుత్వం సోమేశ్‌కుమార్‌ను తెలంగాణ నుంచి రిలీవ్ చేసిన నేపథ్యంలో కేసీఆర్ తక్షణం రామకృష్ణరావుకు చార్జ్ ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది. ఈ మేరకు రామకృష్ణారావును సచివాలయంలోనే ఉండాలని సీఎం కార్యాలయం ఆదేశించినట్లు సమాచారం.
దీంతో ఆయన్నే తాత్కాలిక సీఎస్‌గా నియమిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. సీఎస్‌గా తెలుగువారికి అవకాశం ఇవ్వాలన్న వాదన బలపడుతున్న నేపథ్యంలో రామకృష్ణారావు ఎంపిక జరగనుందని తెలుస్తోంది. బీహార్ కు చెందిన తెలంగాణ క్యాడర్ ఏఐఎస్ అధికారి అరవింద్‌కుమార్ పేరు కూడా ప్రచారంలో ఉన్నప్పటికీ, తెలుగువారికే ప్రాధాన్యం ఇవ్వాలన్నది సీఎం సూత్రప్రాయంగా ఆమోదించినట్లు కూడా అంటున్నారు.
ప్రభుత్వ సలహాదారుగా సోమేశ్‌కుమార్?
తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సీఎస్ సోమేశ్‌కుమార్ మంగళవారం తన బాధ్యతల నుంచి రిలీవ్ అయిన నేపథ్యంలో ఆయన పదవికి వీఆర్ ఎస్ ఇచ్చి, తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా చేరనున్నట్లు తెలుస్తోంది. కేసీఆర్ పరిపాలన వ్యవహారాల్లో సోమేశ్‌కుమార్‌ది కీలక పాత్ర అని చెప్పొచ్చు.
ముఖ్యంగా ధరణి రూపకర్త కూడా సోమేశే. అలాంటి అధికారిని ఏపీకి పంపడానికి కేసీఆర్ కూడా విముఖంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఆయన సేవలను వాడుకునేందుకు వీలుగా అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నియమించనున్నారు. ఈ ప్రతిపాదనకు సోమేశ్‌కుమార్ కూడా సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.