విధాత: అంతర్గత కలహాలతో సతమతమవుతున్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలను చక్కదిద్దేందుకు కాంగ్రెస్ హై కమాండ్ దృష్టి పెట్టింది. ఇందుకోసం కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ను రంగంలోకి దింపింది.
దిగ్విజయ్ సింగ్ ను టీ. కాంగ్రెస్ సలహాదారుగా హైకమాండ్ నియమించింది. తాజాగా టీ. కాంగ్రెస్‌లో పిసిసి చీప్ రేవంత్ కి వ్యతిరేకంగా తిరుగుబాటు లేవనెత్తిన సీనియర్ల అసమ్మతితో రేగిన సంక్షోభాన్ని పరిష్కరించే బాధ్యతను దిగ్విజయ్ సింగ్ కు అప్పగించింది.
గతంలో రాష్ట్ర పార్టీ ఇన్‌చార్జీ గా పనిచేసిన దిగ్విజయ్ సింగ్‌కు ఉన్న అనుభవం.. సీనియర్లతో ఆయనకు ఉన్న సంబంధాల నేపథ్యంలో ఆయనపై టి.కాంగ్రెస్ సంక్షోభ పరిష్కార బాధ్యతలను పెట్టింది.
మరోవైపు ఈ సాయంత్రం జరగాల్సిన కాంగ్రెస్ సీనియర్ల భేటీ ఆ పార్టీ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. దిగ్విజయ్ రాకతో సీనియర్ల వైఖరిలో ఏమైనా మార్పు ఉంటుందో లేదో అన్న చర్చ సాగుతుంది.