లిఫ్ట్ ఇస్తాన‌ని న‌మ్మించి.. 90 ఏండ్ల వృద్ధురాలిపై అత్యాచారం

విధాత‌: ఓ కామాంధుడు వృద్ధురాలిపై క‌న్నేశాడు. లిఫ్ట్ ఇస్తాన‌ని న‌మ్మించిన ఆ వాహ‌న‌దారుడు కామంతో చెల‌రేగిపోయాడు. మాన‌వ‌త్వం లేకుండా వృద్ధురాలిపై అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. ఈ దారుణ ఘ‌ట‌న మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని షాహ్‌డోల్ జిల్లాలో చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెళ్తే.. జ‌బ‌ల్‌పూర్‌కు చెందిన ఓ వృద్ధురాలు త‌న బంధువుల నివాసానికి వెళ్లేందుకు షాహ్‌డోల్ రైల్వేస్టేష‌న్‌కు చేరుకున్నారు. అప్ప‌టికే రాత్రి కావ‌డంతో రైల్వేస్టేష‌న్‌లోనే ఉండిపోయారు వృద్ధురాలు. మ‌రుస‌టి రోజు ఉద‌యం ప్ర‌ధాన ర‌హ‌దారిపై ఉన్న అంట్రా గ్రామానికి చేరుకున్నారు. అక్క‌డ బ‌స్సు […]

  • Publish Date - January 15, 2023 / 12:37 AM IST

విధాత‌: ఓ కామాంధుడు వృద్ధురాలిపై క‌న్నేశాడు. లిఫ్ట్ ఇస్తాన‌ని న‌మ్మించిన ఆ వాహ‌న‌దారుడు కామంతో చెల‌రేగిపోయాడు. మాన‌వ‌త్వం లేకుండా వృద్ధురాలిపై అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. ఈ దారుణ ఘ‌ట‌న మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని షాహ్‌డోల్ జిల్లాలో చోటు చేసుకుంది.

వివ‌రాల్లోకి వెళ్తే.. జ‌బ‌ల్‌పూర్‌కు చెందిన ఓ వృద్ధురాలు త‌న బంధువుల నివాసానికి వెళ్లేందుకు షాహ్‌డోల్ రైల్వేస్టేష‌న్‌కు చేరుకున్నారు. అప్ప‌టికే రాత్రి కావ‌డంతో రైల్వేస్టేష‌న్‌లోనే ఉండిపోయారు వృద్ధురాలు. మ‌రుస‌టి రోజు ఉద‌యం ప్ర‌ధాన ర‌హ‌దారిపై ఉన్న అంట్రా గ్రామానికి చేరుకున్నారు.

అక్క‌డ బ‌స్సు కోసం ఎదురు చూస్తుండ‌గా, బైక్‌పై వ‌చ్చిన ఓ వ్య‌క్తి లిఫ్ట్ ఇస్తాన‌ని వృద్ధురాలిని న‌మ్మించాడు. ఇక ఆమె వెళ్లాల్సిన ఊరికి కాకుండా, వేరే దారిలో బైక్‌ను మ‌ళ్లించాడు. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి వృద్ధురాలిపై అత్యాచారం చేశాడు. ఆ త‌ర్వాత వృద్ధురాలిని అక్కడ్నే వ‌దిలేసి పారిపోయాడు.

బాధితురాలు మొత్తానికి త‌న బంధువుల ఇంటికి చేరిన త‌ర్వాత‌, జ‌రిగిన విష‌యాన్ని చెప్పింది. బాధితురాలి కుటుంబ స‌భ్యులు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు. వృద్ధురాలిని చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.