Rapido, Bengaluru
విధాత: ర్యాపిడో(Rapido) బుక్ చేసుకున్న ఓ యువతి ఆత్మరక్షణ కోసం బైక్ పై నుంచి దూకేసిన ఘటన బెంగళూరులో వెలుగు చూసింది. వివరాళ్లోకి వెళితే.. రోజూలాగే ఆమె ర్యాపిడో బైక్ రైడ్‌ను బుక్ చేసుకుంది. ఓటీపీ చెక్ చేసే నెపంతో ఆమె ఫోన్ తీసుకున్న డ్రైవర్ ఇందిరానగర్‌కు వెళ్లటానికి బదులు దారి మార్చి.. దొడ్డ బళ్లాపూర్ వైపు తిరిగాడు.
రాగ్‌రూట్‌లో వెళ్లటం గమనించిన యువతి.. డ్రైవర్‌ను నిలదీయడంతో అతడు బైక్ వేగం పెంచాడు. ఆమె శరీర భాగాలను అసభ్యంగా ప్రవర్తించడం మొదలు పెట్టాడు. డ్రైవర్ వికృత ప్రవర్తనతో భయపడిపోయిన యువతి.. యలహంక సమీపంలోని నాగెనహళ్లిలోని బీఎంఎస్ కాలేజీ వద్ద ఉన్నపళాన బైకు నడుస్తుండగానే కిందకు దూకేసింది.
ఇదంతా సీసీ టీవీ కెమెరాలో రికార్డయింది. నిందితుడిని దీపక్‌రావుగా గుర్తించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు. బాధితురాలికి కాళ్లు, చేతులపై గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.