Rasi Phalalu | రాశిఫలాలు (చంద్రచారము ఆధారంగా) తేదీ : 19.06.2023; చంద్రచారము మిథునరాశి.
మేష రాశి: చంద్రుడు 3వ ఇంట ఉంటున్నందున ఆర్థిక, వృత్తి, కుటుంబ విషయాల్లో సానుకూల సందర్భాలు కలుగుతాయి. విదేశియాన ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో అనుకోని లాభాలు వచ్చే అవకాశం ఉంది. అనారోగ్య బాధలు అధికం అవుతాయి. ఆకస్మిక ధననష్టాన్ని అధిగమిస్తారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు.
వృషభ రాశి: చంద్రుడు 2వ ఇంట ఉంటున్నందున స్వల్ప నష్టాలు, వృత్తిపరమైన సమస్యలతో మనసు వేదన, దిగులు నిండి ఉంటాయి. మానసిక ఆందోళనతో సమయం గడుస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ప్రయత్నాలు ఆలస్యంగా సఫలం అవుతాయి. చెడు పనులకు దూరంగా ఉండటం మంచిది. వృత్తి, ఉద్యోగాల్లో వృద్ధి ఉంటుంది. స్థిరాస్తుల విషయాల్లో జాగ్రత్త అవసరం.
మిథున రాశి: చంద్రుడు 1వ ఇంట ఉంటున్నందున ఆర్థిక, గృహ, కుటుంబ విషయాల్లో సానుకూల ఘటనలు ఉండొచ్చు. ప్రయత్నకార్యాలు ఫలిస్తాయి. ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది. సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. నూతన వస్తు, ఆభరణాలను పొందుతారు. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. రుణబాధలు తొలగిపోతాయి. ధైర్య సాహసాలతో ముందుకు వెళ్తారు.
కర్కాటక రాశి: చంద్రుడు 12వ ఇంట ఉంటున్నందున ఆర్థికంగా కొంత నష్టపోయే అవకాశం ఉన్నది. స్వల్ప సమస్యలు, టెన్షన్లు ఎదుర్కొంటారు. ఊహించని కార్యాల్లో పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగాల్లో వృద్ధి ఉంటుంది. ఆత్మీయులను కలవలేరు.అనవసర వ్యయాలతో ఆందోళనలు పడుతారు. అనవసర ప్రయాణాలు అధికంగా ఉంటాయి. స్త్రీ మూలకంగా ధన లాభం ఉంటుంది.
సింహ రాశి: చంద్రుడు 11వ ఇంట ఉంటున్నందున ఆర్థిక, వృత్తి, వ్యాపార రంగాల్లో లాభదాయక సందర్భాలు చోటు చేసుకుంటాయి.గౌరవ మర్యాదలు లభిస్తాయి. అనవసరమైన వ్యయ ప్రయాసలుంటాయి. వృధా ప్రయాణాలు ఎక్కువ చేస్తారు. మానసిక ఆందోళనతోనే కాలం వెళ్లదీస్తారు. బంధువులతో వైరాలు రాకుండా జాగ్రత్త పడాలి. శారీరకంగా బలహీనులవుతారు. విందులు, వినోదాలు, సంబురాల్లో పాల్గొంటారు.
కన్యా రాశి: చంద్రుడు 10వ ఇంట ఉంటున్నందున ఆర్థిక, వృత్తి, కుటుంబ, ఆరోగ్య విషయాల్లో చెప్పుకోతగిన మార్పులు తెస్తుంది. ప్రయాణాల్లో వ్యయప్రయాసలు అధికంగా ఉంటాయి. ఆకస్మిక ధన నష్టం జరుగకుండా జాగ్రత్త వహించాలి. . అనారోగ్య సమస్యల కోసం డబ్బు అధికంగా ఖర్చు చేస్తారు. తీర్థయాత్రలకు ప్రయత్నాలు, దైవదర్శనాలు చేస్తారు. స్త్రీలు మానసికొల్లాసాన్ని పొందుతారు.
తులా రాశి: చంద్రుడు 9వ ఇంట ఉంటున్నందున కొన్ని స్వల్ప నష్టాలు, సమస్యలతో మనసు వేదన, విచారంతో నిండి ఉంటుంది. మనస్సు అధీనంలో ఉండదు. గృహంలో మార్పులు కోరుకుంటారు. అనారోగ్యంతో నిరుత్సాహంగా ఉంటారు. స్త్రీలతో తగాదాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ప్రయత్నకార్యాలు ఫలిస్తాయి. కొన్ని పనులు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది.
వృశ్చిక రాశి: చంద్రుడు 8వ ఇంట ఉంటున్నందున కొన్నిఆర్థిక నష్టాలు, వృత్తిపరమైన సమస్యల కారణంగా చిన్నపాటి ఆరోగ్య సమస్యలు కలుగవచ్చు. ధనలాభం ఉంటుంది. నూతన వస్తు, ఆభరణాలు పొందుతారు. కీర్తిప్రతిష్ఠలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో కాలక్షేపం చేస్తారు. ఇతరులకు ఉపకారం చేస్తారు. రుణ బాధలు, శత్రుబాధలు తొలుగుతాయి.
ధనుస్సు రాశి: చంద్రుడు 7వ ఇంట ఉంటున్నందున ఆర్థిక, వృత్తి, కుటుంబ, ఆరోగ్య విషయాల్లో విజయాలను ఆశించవచ్చు. రాజకీయంగా లభ్ధి పొందే అవకాశం ఉంటుంది.. ప్రయత్న కార్యాలన్నీ సంపూర్ణంగా ఫలిస్తాయి. శుభకార్య యత్నాలు సులభంగా తీరుతాయి. సంపూర్ణ ఆరోగ్యవంతులవుతారు. ఇతరులకు ఉపయోగపడే పనులు చేపడతారు. గౌరవమర్యాదలు లభిస్తాయి. శుభవార్తలు వింటారు.
మకర రాశి: చంద్రుడు 6వ ఇంట ఉంటున్నందున ఆరోగ్య, వృత్తి, వ్యాపార రంగాల్లో గణనీయమైన విజయాలు తెస్తుంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. రాజకీయం, క్రీడాకారులకు అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి. అన్నింటా విజయాన్నే సాధిస్తారు. బంధు, మిత్రుల కలుస్తారు. శుభవార్తలు వింటారు. వృత్తి, ఉద్యోగ రంగాల్లోని వారికి అభివృద్ధి ఉంటుంది.
కుంభ రాశి: చంద్రుడు 5వ ఇంట ఉంటున్నందున స్వల్ప నష్టాలు, సమస్యలు, టెన్షన్ల కారణంగా మనసు వేదనతో నిండి ఉంటుంది. నూతన వస్తు, వస్త్ర, ఆభరణాలు పొందుతారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. విద్యార్థుల ప్రతిభకు తగ్గ గుర్తింపు లభిస్తుంది. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. చర్చలు, సమావేశాలు ఆకట్టుకుంటాయి. మనోధైర్యంతో ఉంటారు. శుభవార్తలు వింటారు.
మీన రాశి: చంద్రుడు 4వ ఇంట ఉంటున్నందున కొన్ని వృత్తిపరమైన సమస్యల కారణంగా వివాదాలు, విభేదాలు చోటు చేసుకునే అవకాశం ఉన్నది. అప కీర్తులు, మాటలు పడకుండా జాగ్రత్తగా ఉండాలి. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. ప్రయాణాల్లో వ్యయ, ప్రయాసలు తప్పవు. కలహాలకు దూరంగా ఉండాలి. దూరమైన వ్యక్తుల పరిచయం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి.