Rasi Phalalu | దిన ఫలాలు (చంద్రచారము ఆధారంగా)
తేదీ : 07.06.2023; చంద్రచారము మకరరాశి.
Horoscope | జ్యోతిషం, రాశి ఫలాలు విశ్వసించే వారు చాలామంది ఉంటారు. దిన ఫలాలను చూసిన తర్వాతే తమ రోజువారీ కార్యకలాపాలను ప్రారంభిస్తుంటారు. వాటి అనుగుణంగానే రోజును ప్లాన్ చేసుకుంటుంటారు. వారి కోసం నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..
మేషరాశి: ఆర్థిక విషయాల్లో గణనీయమై మార్పులు కనిపిస్తాయి. వృత్తిపరంగా, సానుకూలతలు ఉంటాయి. కుటుంబ, ఆరోగ్య విషయాల్లోనూ చెప్పుకోతగిన సాఫల్యాలు ఉంటాయి.
వృషభరాశి: స్వల్ప నష్టాలు, వృత్తిపరమైన ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉన్నది. ఫలితంగా మానసిక వేదన, విచారం ఉంటాయి.
మిథునరాశి: కొన్ని ఆర్థిక నష్టాలు, వృత్తిపరమైన ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉన్నది. ఫలితంగా స్వల్ప ఆరోగ్య సమస్యలు తలెత్తొచ్చు.
కర్కాటక రాశి: ఆర్థిక, వృత్తిపరమైన రంగాల్లో మెరుగైన ఫలితాలను ఆశింవచ్చు. ఆరోగ్య, కుటుంబ విషయాల్లోనూ పరిస్థితులు మెరుగవుతాయి.
సింహరాశి: ఆరోగ్య, ఆర్థిక విషయాల్లో సాఫల్యాలు ఉంటాయి. వృత్తి, వ్యాపార రంగంలోనూ విజయాలు సాధిస్తారు.
కన్యారాశి: స్వల్ప నష్టాలు, వృత్తిపరమైన ఇబ్బందుల కారణంగా మానసిక వేదనకు గురయ్యే అవకాశం ఉన్నది.
తులారాశి: స్వల్ప నష్టాలు, సమస్యల కారణంగా వివాదాలు, శత్రుత్వాలు కలిగే అవకాశం ఉన్నది.
వృశ్చికరాశి: గృహ, కుటుంబ విషయాల్లో మెరుగుదలను ఆశించవచ్చు.
ధనూరాశి: స్వల్ప నష్టాలు, ఇబ్బందుల కారణంగా మనసు వేదనతో, దిగులుతో ఉండే అవకాశం ఉన్నది.
మకరరాశి: ఈ రాశివారికి అభిలాషలు కలుగజేస్తుంది. సంతోషంగా ఉంటారు. అయితే.. ఊహాత్మక ఎంపికలు చేయవద్దు.
కుంభరాశి: ఫైనాన్స్ పరంగా కొన్ని నష్టాలు ఎదురయ్యేందుకు అవకాశం ఉన్నది. స్వల్ప సమస్యలు, టెన్షన్లు ఉంటాయి.
మీనరాశి: ఆర్థిక విషయాలతో పాటు.. వృత్తి, కుటుంబ విషయాల్లో లాభదాయక పరిణామాలు ఉంటాయి.