యాదాద్రి భువనగిరి జిల్లా: రేవ్ పార్టీ భగ్నం.. నలుగురి అరెస్టు

విధాత: యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం తిరుమలగిరి శివారులోని అడ్వెంచర్ కోవే రిసార్ట్ పై భువనగిరి ఎస్ఓటీ పోలీసులు దాడి చేసి రేవ్ పార్టీని భగ్నం చేశారు. నలుగురు నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. రేవ్ పార్టీ కోసం 400 మంది యువతీ యువకులు ఎంట్రీ టికెట్ పొందినట్లు పోలీసులు గుర్తించారు. పార్టీకి వచ్చిన వారిలో 200మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని రేవ్ పార్టీ వివరాలు తెలుసుకున్నారు. ఎస్ఓటీ పోలీసులు అందించిన వివరాల మేరకు పోలీసులు […]

  • Publish Date - January 1, 2023 / 10:01 AM IST

విధాత: యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం తిరుమలగిరి శివారులోని అడ్వెంచర్ కోవే రిసార్ట్ పై భువనగిరి ఎస్ఓటీ పోలీసులు దాడి చేసి రేవ్ పార్టీని భగ్నం చేశారు. నలుగురు నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు.

రేవ్ పార్టీ కోసం 400 మంది యువతీ యువకులు ఎంట్రీ టికెట్ పొందినట్లు పోలీసులు గుర్తించారు. పార్టీకి వచ్చిన వారిలో 200మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని రేవ్ పార్టీ వివరాలు తెలుసుకున్నారు. ఎస్ఓటీ పోలీసులు అందించిన వివరాల మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు .