విధాత: భారతీయ రిజర్వ్ బ్యాంకు చెలామణి నుంచి రూ.2వేల నోట్లను చెలామణి నుంచి వెనక్కి తీసుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత చలామణిలో ఉన్న నోట్లను మార్చుకునేందుకు అక్టోబర్ 7 వరకు గడువు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆర్బీఐ కీలక ప్రకటన చేసింది. 97.26శాతం రూ.2వేల నోట్లు తిరిగి బ్యాంకులకు చేరాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఇంకా రూ.9,762 కోట్ల విలువైన రూ.2వేల నోట్లు ఇంకా మార్కెట్‌లోనే ఉన్నాయని ప్రకటించింది.
ఈ ఏడాది మే 19 నాటికి మార్కెట్‌లో రూ.3.56 లక్షల కోట్ల విలువైన రూ.2వేల నోట్లు ఉన్నాయని.. నవంబర్ 30 నాటికి రూ.9,760 కోట్లకు తగ్గాయని ఆర్‌బీఐ పేర్కొంది. ఆర్‌బీఐ మే 19న రూ.2వేల నోట్లను రద్దు చేయగా.. మొదట నాలుగు నెలలు మార్పిడి చేసుకునేందుకు, డిపాజిట్ చేసేందుకు అవకాశం ఇచ్చింది. ఆ తర్వాత మరో వారం రోజులు గడువు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నది.
చివరగా అక్టోబర్ 7న గడువు ముగిసింది. అయితే, గడువు ముగిసినా నోట్లను మార్చుకోవచ్చని ఆర్‌బీఐ పేర్కొంది. దేశవ్యాప్తంగా ఉన్న ఆర్‌బీఐ కార్యాలయాల్లో మార్చుకోవచ్చని ఆర్‌బీఐ తెలిపింది. అలాగే, ఏదైనా పోస్టాఫీస్ నుంచి ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాలకు రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా పంపి.. తమ బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని కోరే అవకాశం సైతం ఉన్నది.