చ‌రిత్రను తిర‌గ రాయండి.. మీకే మా మ‌ద్దతు: అమిత్‌షా

విధాత‌: ప్ర‌స్తుత‌మున్న చ‌రిత్ర‌ను తిర‌గ‌ రాయండి.. మీకు కేంద్ర ప్ర‌భుత్వ సంపూర్ణ మ‌ద్ద‌తు ఉంటుందంటూ కేంద్ర హోం మంత్రి అమిత్‌షా పిలుపునిచ్చారు. అస్సాం ప్ర‌భుత్వం ఢిల్లీలో నిర్వ‌హించిన అహోం జ‌న‌ర‌ల్ ల‌చిత్ బ‌ర్ఫ‌కాన్ 400వ జ‌యంతి వేడుక‌ల్లో పాల్గొన్న ఆయ‌న చ‌రిత్ర కారులు చ‌రిత్ర‌ను తిర‌గరాయాల‌ని కోరారు. గ‌తంలో చ‌రిత్ర కారులంతా పాక్షిక దృష్టితో మ‌న చ‌రిత్ర‌ను వ‌క్రీక‌రించార‌ని ఆరోపిస్తూ, ఆ చ‌రిత్ర‌ను మార్చాల‌న్నారు. అప్పుడే మ‌న రాజ‌వంశాల‌, యోధులకు సంబంధించిన అస‌లు చ‌రిత్ర తెలుస్తంద‌ని అన్నారు. […]

  • Publish Date - November 25, 2022 / 02:40 PM IST

విధాత‌: ప్ర‌స్తుత‌మున్న చ‌రిత్ర‌ను తిర‌గ‌ రాయండి.. మీకు కేంద్ర ప్ర‌భుత్వ సంపూర్ణ మ‌ద్ద‌తు ఉంటుందంటూ కేంద్ర హోం మంత్రి అమిత్‌షా పిలుపునిచ్చారు. అస్సాం ప్ర‌భుత్వం ఢిల్లీలో నిర్వ‌హించిన అహోం జ‌న‌ర‌ల్ ల‌చిత్ బ‌ర్ఫ‌కాన్ 400వ జ‌యంతి వేడుక‌ల్లో పాల్గొన్న ఆయ‌న చ‌రిత్ర కారులు చ‌రిత్ర‌ను తిర‌గరాయాల‌ని కోరారు.

గ‌తంలో చ‌రిత్ర కారులంతా పాక్షిక దృష్టితో మ‌న చ‌రిత్ర‌ను వ‌క్రీక‌రించార‌ని ఆరోపిస్తూ, ఆ చ‌రిత్ర‌ను మార్చాల‌న్నారు. అప్పుడే మ‌న రాజ‌వంశాల‌, యోధులకు సంబంధించిన అస‌లు చ‌రిత్ర తెలుస్తంద‌ని అన్నారు. మ‌న చ‌రిత్ర‌ను మ‌న‌మే రాసుకొనే క్ర‌మంలో మ‌న దేశాన్ని150 ఏండ్లు పాలించిన 30 రాజ వంశాల చ‌రిత్ర‌ను, స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొన్న 300మంది యోధుల గురించి ప‌రిశోధ‌న చేసి రాయాల‌ని అన్నారు.

ఇప్ప‌టికే బీజేపీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత విద్య‌ను కాషాయీక‌ర‌ణ చేస్తున్నార‌న్న ఆరోప‌ణ‌లున్నాయి. ప్రముఖ చ‌రిత్ర‌కారులు రోమిలా థాప‌ర్‌, బిపిన్ చంద్ర లాంటి చ‌రిత్ర కారులు రాసిన పాఠ్యాంశాల‌ను తొల‌గించార‌న్న విమ‌ర్శ‌లున్నాయి. ఈ నేప‌థ్యంలో అమిత్ షా చ‌రిత్రను తిర‌గ‌రాయండ‌న్న పిలుపు వినాశ‌క‌ర‌ మైన‌ద‌ని స‌ర్వ‌త్రా వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతున్న‌ది.