Site icon vidhaatha

Reba Monica John | ‘బ్రో’, ‘జెర్సీ’ ఛాన్స్ మిస్‌.. ‘సామజవరగమన’తో దశ తిరిగింది

Reba Monica John

విధాత‌: అవకాశాన్ని అందుకోవడానికి కూడా అదృష్టం ఉండాలంటారు. ఏదైనా చేయి జారిపోయాకనే దాని విలువ తెలిసేది. అయితే అవకాశం వచ్చినా కూసింత అదృష్టం పాళ్ళు కలవకపోతే ఇదిగో ఇలానే హిస్టరీలో చెప్పుకోవాలి తప్పిదే చేసేది ఏం ఉండదు. ముఖ్యంగా సినిమా వాళ్ళు చెబుతూ ఉంటారు అప్పుడు ఆ సినిమా చేయలేకపోయానని. అదేమో సూపర్ హిట్ సినిమా అయ్యి కూచుంటుంది. ఇలా అదృష్టం పాళ్ళు కాస్త ఎక్కువే ఉన్నందువల్లేమో ఆమె మరో సినిమాకి బుక్ అయ్యి సక్సెస్‌ని అందుకుంది.

‘సామజవరగమన’ సినిమాతో మంచి సక్సెస్‌ని అందుకున్న నటి రెబా మోనికా జాన్ ఈమధ్య ఓ ఇంటర్వ్యూలో తనకు గతంలో వచ్చిన ఆఫర్స్‌ని చెప్పుకొచ్చింది. మెగా హీరోలతో చేయాల్సిన ‘బ్రో’ సినిమాను, అలాగే నాని ‘జెర్సీ’ మూవీని కూడా మిస్ అయ్యానంది. ‘విజిల్’ అనే తమిళ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సైతం పరిచయమైన ఈ అమ్మడు.. టాలీవుడ్‌లో తన అదృష్టాన్ని ‘సామజవరగమన’తో పరీక్షించుకుంది.

అయితే సినిమా అవకాశాలు ఎలా వస్తాయో ఎలా చేయి జారిపోతాయో చెప్పడం కష్టం. ఇదంతా కరి మ్రింగిన వెలగ పండు వ్యవహారం. ‘బ్రో’ సినిమా కోసం లుక్ టెస్ట్ అయ్యాకా సాయిధరమ్ తేజ్ చెల్లెలి పాత్ర కోసం తీసుకుంటున్నా మన్నారు. సెలక్ట్ అయింది లేంది చెబుతామన్నారు. ఏమైందో ఏమో నన్ను సెలక్ట్ చేయలేదు. అప్పుడే లుక్ టెస్ట్ కోసం వెళుతున్న సమయంలోనే హాస్య మూవీస్ నిర్మాతల్ని కలిశాను.

అక్కడే ఉన్న రామ్ అబ్బరాజు నాతో ఓ సెల్ఫీ దిగారు. నేను ఎవరో మీకు తెలుసా అని అడిగాను. అప్పటికి ఇంకా తెలుగు సినిమానే చేయలేదు నేను. ఆయన వెంటనే నేను త్వరలో ‘సామజవరగమన’ అనే టైటిల్‌తో సినిమా చేయబోతున్నాను. అందులో నువ్వే హీరోయిన్ అనేసరికి ఆనందం పట్టలేక పోయాను. అలా ఓ అవకాశం చేజారిపోయి మరోటి అందుకున్నానని చెప్పుకొచ్చింది రెబా.

ఇక హీరో నానీతో చేయాల్సిన జెర్సీ కూడా డేట్స్ కుదరక వదులుకుందట. నిజానికి నాని అంటే తనకు చాలా ఇష్టమని చెప్పుకొచ్చింది రెబా. తనకో సినిమా జారిపోయి మరో హిట్ అందుకుంది కాబట్టి ఇదంతా మాట్లాడుకుంటున్నాం కానీ.. ఇలా అవకాశాలను అందిపుచ్చుకునే తరుణంలోనే ఎందరు అందగత్తెలు తెరమరుగైపోతున్నారో కదా. ఎలా చూసినా రెబా లక్కీనే అని చెప్పుకోవాలి.

Exit mobile version