OTT Movies | ఈ వారం ఓటీటీ ప్రియుల‌కి పండ‌గే.. మంచి సినిమాలతో ప్రేక్ష‌కుల‌కి ఫుల్ ఎంట‌ర్‌టైన్‌మెంట్

OTT Movies | ఇప్పుడు సినీ ప్రియుల‌కి థియేట‌ర్‌లోనే కాదు ఓటీటీలోను మంచి వినోదం అందుతుంది. స‌రికొత్త కంటెంట్‌తో ప్రేక్ష‌కుల‌ని ఎంట‌ర్‌టైన్ చేసేందుకు ఓటీటీ సంస్థ‌లు ఎంత‌గానో కృషి చేస్తున్నాయి. ఒక‌వైపు వెబ్ సిరీస్‌లు, మ‌రో వైపు చిత్రాలతో సినీ ప్రియుల‌కి కావ‌ల‌సినంత ఎంట‌ర్‌టైన్‌మెంట్ అందుతుంది. ప్ర‌తి వారం మాదిరిగానే ఈ వారం కూడా ఓటీటీలో సంద‌డి చాలానే ఉంది. బేబి, బ్రో సినిమాలతో ఓటీటీ ప్రియుల‌కి మంచి మ‌జా దొర‌క‌నుంది. ఇక థియేటర్లో చూస్తే మంచి […]

  • Publish Date - August 22, 2023 / 02:52 AM IST

OTT Movies |

ఇప్పుడు సినీ ప్రియుల‌కి థియేట‌ర్‌లోనే కాదు ఓటీటీలోను మంచి వినోదం అందుతుంది. స‌రికొత్త కంటెంట్‌తో ప్రేక్ష‌కుల‌ని ఎంట‌ర్‌టైన్ చేసేందుకు ఓటీటీ సంస్థ‌లు ఎంత‌గానో కృషి చేస్తున్నాయి.

ఒక‌వైపు వెబ్ సిరీస్‌లు, మ‌రో వైపు చిత్రాలతో సినీ ప్రియుల‌కి కావ‌ల‌సినంత ఎంట‌ర్‌టైన్‌మెంట్ అందుతుంది. ప్ర‌తి వారం మాదిరిగానే ఈ వారం కూడా ఓటీటీలో సంద‌డి చాలానే ఉంది.

బేబి, బ్రో సినిమాలతో ఓటీటీ ప్రియుల‌కి మంచి మ‌జా దొర‌క‌నుంది. ఇక థియేటర్లో చూస్తే మంచి హైప్ ఉన్న సినిమాలు బ‌రిలోకి దిగుతున్నాయి . కొన్ని డబ్బింగ్ సినిమాలు సందడి చేసేందుకు సిద్ధ‌మ‌య్యాయి.

దుల్కర్ సల్మాన్ కింగ్ ఆఫ్ కొత్త అంటూ రాబోతుండ‌గా, ఈ సినిమాకి పోటీగా బాయ్స్ హాస్టల్ అంటూ రాబోతుంది.బెదరులంక 2012, వరుణ్ తేజ్ సాక్షి వైద్యల కాంబోలో తెరకెక్కిన గాండివధారి అర్జున చిత్రాలు ఈ శుక్ర‌వారం సండి చేయ‌బోతున్నాయి.

సాయి రాజేష్ తెరకెక్కించిన బేబి సినిమాలో ఆనంద్, వైష్ణవి, విరాజ్ కీల‌క పాత్ర పోషించ‌గా, ఈ చిత్రం పెద్ద హిట్ అయింది. ఆగస్ట్ 25 నుంచి ఆహాలో బేబి సంద‌డి చేయ‌నుంది.

ఇక పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ నటించిన బ్రో సినిమా బాక్సాఫీస్ వద్ద మిశ్రమ ఫలితం రాబ‌ట్ట‌గా, ఇప్పుడు ఈ చిత్రాన్ని నెట్ ఫ్లిక్స్‌లో ఆగస్ట్ 25 నుంచి స్ట్రీమింగ్ చేయ‌నున్నారు.

ఇక వీటితో పాటు రగ్నరోక్‌ (వెబ్‌సిరీస్‌) ఆగస్టు 24 వ తేదీ నుంచి , కిల్లర్‌ బుక్‌ క్లబ్‌ (హాలీవుడ్) ఆగస్టు 25 వ తేదీ నుంచి , లిఫ్ట్‌ (హాలీవుడ్‌) ఆగస్టు 25 వ తేదీ నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నాయి.

ఇక డిస్నీ+హాట్‌స్టార్ లో ఆఖ్రి సోచ్‌ (హిందీ సిరీస్‌) ఆగస్టు 25 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. బుక్‌ మై షోలో సమ్‌వేర్‌ ఇన్‌ క్వీన్స్‌ (హాలీవుడ్‌) ఆగస్టు 21 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

లయన్స్‌గేట్‌ప్లే లో ఎబౌట్‌ మై ఫాదర్‌ (హాలీవుడ్‌) ఆగస్టు 25 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. జియో సినిమాలో లఖన్‌ లీలా భార్గవ (హిందీ) ఆగస్టు 21 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. ఇక బజావ్‌ (హిందీ) ఆగస్టు 25 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

యాపిల్‌ టీవీ ప్లస్‌లో చూస్తే.. ఇన్వాజిన్‌2 (వెబ్‌సిరీస్‌)ఆగస్టు 23 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. మొత్తానికి ఇటు థియేట‌ర్, అటు ఓటీటీలో ఈ వారం మంచి మ‌జా అయితే దొర‌క‌డం ఖాయంగా క‌నిపిస్తుంది.

Latest News