Astrology | ఈ 4 నెలల్లో పుట్టిన పురుషులకు.. పెళ్లి తర్వాత రాజయోగమే..!
Astrology | ప్రతి రోజు ఈ భూమ్మీద ఎంతో మంది పురుడు( Birth ) పోసుకుంటారు. అయితే కొన్ని ఘడియల్లో, కొన్ని రోజుల్లో, కొన్ని నెలల్లో పుట్టిన వారికి జీవితాంతం రాజయోగం( Raja yogam ) ఉంటుంది. మరి ముఖ్యంగా ఈ నాలుగు నెలల్లో పుట్టిన పురుషులకు( Male ) పెళ్లైన తర్వాత ఆర్థికంగా, సామాజికంగా కలిసి వస్తుందట. కాబోయే భార్య( Wife ) వల్ల జీవితాంతం రాజయోగం ఉంటుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.

Astrology | చాలా మందికి పుట్టిన( Birth ) సమయం, కాలం కలిసిరావు. అలాంటి వారు పుట్టినప్పటి నుంచి మరణించే వరకు అనేక కష్టాలను ఎదుర్కొంటారు. కానీ కొందరికి పుట్టిన సమయం, కాలం కలిసి వస్తుంది. అలాంటి వారు జీవితాన్ని సంతోషంగా గడుపుతారు. అయితే ఈ నాలుగు నెలల కాలంలో పుట్టిన వారికి పెళ్లైన ( Marriage )తర్వాత రాజయోగం( Raja Yogam ) కలుగుతుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. మరి ఆ నాలుగు నెలలు ఏవో ఈ కథనంలో తెలుసుకుందాం.
జనవరి ( January )
ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం మొదటి నెల అయిన జనవరిలో జన్మించిన పురుషులు ఉత్తమ పురుషులట. భవిష్యత్ ప్రణాళికలు రచించడంలో దిట్టనట. దీంతో వృత్తిపరమైన విజయాలను సునాయసంగా అందుకుంటారట. ఇక వివాహమైన తర్వాత.. ఆర్థిక స్థిరత్వం మరింత పెరుగుతుందట. తమ ఆర్థిక భవిష్యత్‌ను సురక్షితం చేసుకునేందుకు కష్టపడి పని చేస్తారట. అంతేకాకుండా బాధ్యత, క్రమశిక్షణను కలిగి ఉంటారట.
ఏప్రిల్ ( April )
ఇక ఏప్రిల్ నెలలో జన్మించే పురుషులు వాస్తవికతకు దగ్గరగా ఉంటారట. ప్రతి పనిని ఒక ప్రణాళిక ప్రకారం చేస్తారట. దీంతో విజయ తీరాలకు ఈజీగా చేరుకుంటారట. ఇక పెళ్లి తర్వాత పురుషుల ఏకాగ్రత, స్థిరత్వం పెరిగి, ఆర్థిక స్థితి పెరగడానికి దారి తీస్తుందట. అంతేకాకుండా కష్టాన్ని నమ్ముకుంటారట, నమ్మకంగా ఉంటారట కూడా. ప్రేమగల భాగస్వామి మద్దతుతో, వారు ఎంచుకున్న వ్యాపారం లేదా వృత్తిలో గొప్పగా రాణిస్తారట.
ఆగస్టు( August )
ఆగస్టు నెలలో పుట్టిన పురుషులు అసాధ్యమైన తెలివితేటలను కలిగి ఉంటారట. ఈ తెలివితేటల కారణంగా పెళ్లి తర్వాత ఆర్థిక విజయాలను సాధిస్తారట. ఆలోచనలు కూడా విశ్లేషణాత్మకంగా ఉంటాయట. సొంత వ్యాపారంలో బాగా రాణిస్తారట. తమ కుటుంబాన్ని పోషించడానికి, భవిష్యత్‌ను సురక్షితం చేసుకునేందుకు ప్రయత్నిస్తారట. బడ్జెట్ విషయంలో, డబ్బు పొదుపు విషయంలో మంచి నైపుణ్యాన్ని కలిగి ఉంటారట.
నవంబర్( November )
నవంబర్ నెలలో జన్మించిన పురుషులు ఆకర్షణీయంగా ఉంటారట. సానుకూల నిర్ణయాలు తీసుకునేందుకు ఇష్టపడుతారట. వివాహం తర్వాత సహోద్యోగులు, కస్టమర్లతో సామరస్యపూర్వకంగా ఉంటారట. దీంతో ఆర్థిక వృద్ధికి అవకాశాలు మెండుగా ఉంటాయట. న్యాయంపై పదునైన అవగాహన ఉంటుందట. ఇది వారిని నమ్మదగిన వ్యాపార భాగస్వాములుగా చేస్తుంది. వృద్ధికి సరైన మార్గాన్ని కనుగొనే వారి సామర్థ్యం విజయవంతమైన ఉమ్మడి ప్రయత్నాలకు దారి తీస్తుంది అని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.