INDIA| ప్ర‌తి ఏడాది ఆగ‌స్ట్‌, సెప్టెంబ‌ర్ నెల‌లోనే టీమిండియాకి విశ్రాంతి ఇస్తున్నారు ఎందుకు?

INDIA| ఈ ఏడాది టీమిండియా సరికొత్త చ‌రిత్ర సృష్టించింది. ఎన్నేళ్ల నుండో టీ20 ప్ర‌పంచ క‌ప్ ద‌క్కించుకోవాల‌ని త‌హ‌త‌హ‌లాడుతుండ‌గా, ఎట్ట‌క‌లేకి రోహిత్ నాయ‌క‌త్వంలో తిరిగి మ‌రోసారి క‌ప్ అందుకుంది. ఇక టీ20 ప్ర‌పంచ క‌ప్ త‌ర్వాత ఇండియా జ‌ట్టు జింబాబ్వే, శ్రీలంక‌తో మ్యాచ్‌లు ఆడింది. అనంత‌రం 42 రోజుల పాటు విశ్రాంతి తీసుకోనుంది. సెప్టెంబర్ 19న సొంతగడ్డపై బంగ్లాదేశ్‌తో ప్రారంభమయ్యే టెస్ట్ సిరీస్‌తో టీమిండియా అంతర్జాతీయ క్రికెట్‌ను మ‌ళ్లీ పు

  • By: sn    sports    Aug 14, 2024 7:50 AM IST
INDIA| ప్ర‌తి ఏడాది ఆగ‌స్ట్‌, సెప్టెంబ‌ర్ నెల‌లోనే టీమిండియాకి విశ్రాంతి ఇస్తున్నారు ఎందుకు?

INDIA| ఈ ఏడాది టీమిండియా సరికొత్త చ‌రిత్ర సృష్టించింది. ఎన్నేళ్ల నుండో టీ20 ప్ర‌పంచ క‌ప్ ద‌క్కించుకోవాల‌ని త‌హ‌త‌హ‌లాడుతుండ‌గా, ఎట్ట‌క‌లేకి రోహిత్ నాయ‌క‌త్వంలో తిరిగి మ‌రోసారి క‌ప్ అందుకుంది. ఇక టీ20 ప్ర‌పంచ క‌ప్ త‌ర్వాత ఇండియా జ‌ట్టు జింబాబ్వే, శ్రీలంక‌తో మ్యాచ్‌లు ఆడింది. అనంత‌రం 42 రోజుల పాటు విశ్రాంతి తీసుకోనుంది. సెప్టెంబర్ 19న సొంతగడ్డపై బంగ్లాదేశ్‌తో ప్రారంభమయ్యే టెస్ట్ సిరీస్‌తో టీమిండియా అంతర్జాతీయ క్రికెట్‌ను మ‌ళ్లీ పున:ప్రారంభించ‌బోతుందొ. అయితే టీమిండియాకు ఉన్న క్రేజ్ నేపథ్యంలో ఒక సిరీస్‌‌‌కు మరొక సిరీస్‌కు మధ్య కేవ‌లం 10 నుండి 15 రోజుల గ్యాప్ మాత్ర‌మే ఇస్తున్నారు. అయితే కొన్నేళ్లుగా ప్రతీ ఏడాది ఆగస్ట్, సెప్టెంబర్‌ నెలల్లో టీమిండియాకు సుదీర్ఘ విశ్రాంతి ఇవ్వ‌డం అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది.

ప్రతీ ఏడాది ఈ రెండు నెలల్లో టీమిండియాకు లాంగ్ బ్రేక్ ఇవ్వడానికి బలమైన కారణం ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో ఛాంపియన్స్ లీగ్ కోసం బీసీసీఐ.. ఈ రెండు నెలల మధ్య స్లాట్ కేటాయించింది. ఐపీఎల్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన జట్లు.. ఇతర లీగ్స్ బెస్ట్ టీమ్స్‌తో ఈ టోర్నీ జరిగేది.అయితే 2008 నుండి 2014 వ‌ర‌కు ఈ టోర్నీ జ‌రిగేది. కొన్ని కార‌ణాల వ‌ల‌న అది ఆగిపోయింది. కాక‌పోతే ఆ లీగ్ కోసం అని ఆగస్ట్, సెప్టెంబర్‌లో అంతర్జాతీయ మ్యాచ్‌లు లేకుండా బీసీసీఐ చూసుకునేది. ఛాంపియన్స్ లీగ్ ముగిసిన తర్వాత కూడా బీసీసీఐ ఇదే సంప్రదాయాన్ని కొనసాగించడం విశేషం. అయితే చాంపియన్స్ లీగ్‌కి బ‌దులు మినీ ఐపీఎల్ నిర్వహించాలని బీసీసీఐ చాలా రోజులుగా ప్రయత్నాలు చేస్తున్న ప్ర‌స్తుతం చ‌ర్చ‌ల ద‌శ‌లో ఉన్నాయి.

భవిష్యత్తులో మినీ ఐపీఎల్ కార్యరూపం దాల్చే అవకాశం ఉంది. ఆగస్ట్-సెప్టెంబర్ మధ్య రెండు వారాల పాటు మినీ ఐపీఎల్ నిర్వ‌హించే ప్లాన్ చేస్తున్నారు. భారత్‌లో క్రికెట్‌కు ఉన్న క్రేజ్ నేపథ్యంలో మినీ ఐపీఎల్ కూడా సూపర్ సక్సెస్ అవుతోంది అని భావిస్తున్నారు. ఐపీఎల్ వ‌ల్ల క్రికెట్ దెబ్బ‌తింటుండ‌గా ఇక ఇప్పుడు మినీ ఐపీఎల్ పెడితే వ‌న్డే, టెస్ట్‌ల‌కి పూర్తి ఆద‌ర‌ణ త‌గ్గుతుంద‌ని, ఆట‌గాళ్ల‌పై విమ‌ర్శ‌లు ఎక్కువ‌య్యే అవ‌కాశం ఉంద‌ని కొంద‌రు చెబుతున్నారు. చూడాలి మ‌రి రానున్న రోజుల‌లో బీసీసీఐ ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటుందో.