Amazon Great Freedom Festival Sale | కొత్త స్మార్ట్‌ఫోన్లు కొనాలనుకుంటున్నారా..? ఆగండి ఆగండి..! అమెజాన్‌ గ్రేట్‌ ఫ్రీడమ్‌ సేల్‌ వచ్చేస్తోంది..!

Amazon Great Freedom Festival Sale | ఆన్‌లైన్‌లో వస్తువులను కొనుగోలు చేసేవారికి గుడ్‌న్యూస్ అమెజాన్‌ గ్రేట్‌ ఫ్రీడమ్‌ ఫెస్టివల్‌ సేల్‌ మరోసారి రాబోతున్నది. ప్రతి ఏటా ఆగస్టులో అమెజాన్‌ ఫ్రీడమ్ ఫెస్టివల్‌ నిర్వహించే విషయం తెలిసిందే.

Amazon Great Freedom Festival Sale | కొత్త స్మార్ట్‌ఫోన్లు కొనాలనుకుంటున్నారా..? ఆగండి ఆగండి..! అమెజాన్‌ గ్రేట్‌ ఫ్రీడమ్‌ సేల్‌ వచ్చేస్తోంది..!

Amazon Great Freedom Festival Sale | ఆన్‌లైన్‌లో వస్తువులను కొనుగోలు చేసేవారికి గుడ్‌న్యూస్ అమెజాన్‌ గ్రేట్‌ ఫ్రీడమ్‌ ఫెస్టివల్‌ సేల్‌ మరోసారి రాబోతున్నది. ప్రతి ఏటా ఆగస్టులో అమెజాన్‌ ఫ్రీడమ్ ఫెస్టివల్‌ నిర్వహించే విషయం తెలిసిందే. ఈ ఏడాది ఆగస్టు 6న మొదలై వారం లేదంటే 15 వరకు అందుబాటులో అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. ఇప్పటికే పలు డీల్స్‌ వివరాలు లీక్‌ కాగా.. మరికొన్ని డీల్స్‌ వివరాలు త్వరలోనే బయటకు రానున్నాయి. స్మార్ట్ ఫోన్స్, స్మార్ట్ టీవీలపై 80శాతం వరకూ డిస్కౌంట్ లభించే అవకాశం ఉన్నది. స్మార్ట్ ఫోన్, స్మార్ట్ టీవీ, ఇతర ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్స్‌ కొనాలని భావిస్తుంటే.. ఇదే మంచి తరుణం. మరో నాలుగైదు రోజుల్లో కళ్లు చెదిరే ఆఫర్స్‌ అందుబాటులోకి రాబోతున్నాయి. వన్‌ప్లస్‌ నార్డ్‌ సీఈ 4లైట్‌ (OnePlus Nord CE 4 Lite), వన్‌ప్లస్‌ నార్డ్‌ 4 (OnePlus Nord 4), వన్‌ప్లస్‌ నార్డ్‌ సీఈ4 (OnePlus Nord CE4), వన్‌ప్లస్‌ ఓపెన్‌ (OnePlus Open), వన్‌ప్లస్‌ 12ఆర్‌ (OnePlus 12R), వన్‌ప్లస్‌ 12 (OnePlus 12)పై ఆకర్షణీయమైన డిస్కౌంట్‌ను ఇవ్వనున్నట్లు ప్రకటించింది.

వీటితో పాటు ఐక్యూ, రెడ్‌మీ, పోకో, టెన్కో కంపెనీలకు చెందిన మొబైల్స్‌పై సైతం డిస్కౌంట్‌ ఇవ్వనున్నట్లు తెలిపింది. ఐక్యూ జెడ్‌9 లైట్‌ (iQoo Z9 Lite), ఐక్యూ 12 (iQoo 12), ఐక్యూ నియో 9ప్రొ (iQoo Neo 9 Pro), ఐక్యూ జెడ్‌7 ప్రొ (iQoo Z7 pro), ఐక్యూ జెడ్‌9 (iQoo Z9), ఐక్యూ జెడ్‌9ఎక్స్‌ (iQoo Z9X), రెడ్‌మీ 13 (Redmi 13), రెడ్‌మీ నోట్‌ 13 ప్రొ (Redme Note !3 Pro), రెడ్‌మీ 12 (Redmi 12), రెడ్‌మీ నోట్‌ 13 ప్రొ ప్లస్‌ ( Redmi Note 13 pro plus), షవోమి 14 (Xiaomi 14), శామ్‌సంగ్‌ గెలాక్సీ ఎం15 (Samsung Galaxy M15) శామ్‌సంగ్‌ ఏ35 (Samsung Galaxy A35) మోడల్స్‌పై 40 నుంచి 80శాతం వరకు డిస్కౌంట్‌ కొనుగోలు చేసేందుకు వీలుంది. దాంతో పాటు స్పెషల్‌ కూపన్స్‌ ద్వారా మరో రూ.10వేల వరకు ప్రత్యేకంగా తగ్గింపు రానున్నది. ఎక్స్ఛేంజ్‌ ఆఫర్‌ సైతం అందుబాటులో ఉండనున్నది. ఫోన్‌ మోడల్‌ను బట్టి రూ.50వేల వరకు తగ్గింపు ఉండనున్నది. స్మార్ట్ ఫోన్ యాక్సెసరీలపై 40శాతం వరకూ డిస్కౌంట్ ఉండనున్నట్లు తెలుస్తున్నది. స్మార్ట్ టీవీలు, గృహోపకరణ వస్తువులపై 65శాతం వరకు తగ్గింపు ఉండనున్నట్లు తెలుస్తున్నది.

Read Also : 

Bank Holidays in August | ఆగస్టులో 13 రోజులు బ్యాంకుల మూసివేత.. పనులుంటే త్వరగా చేసుకోండి మరి..!

Reid Hoffman | ఇంకో పదేళ్లలో ఆ ఉద్యోగాలు మాయం.. తగ్గిపోతున్న మనుషుల అవసరం..!