Bank Holidays in August | ఆగస్టులో 13 రోజులు బ్యాంకుల మూసివేత.. పనులుంటే త్వరగా చేసుకోండి మరి..!
Bank Holidays in August | ఆగస్టు మాసంలో 13 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. ఈ మేరకు ఆర్బీఐ బ్యాంకుల సెలవులకు సంబంధించిన జాబితాను విడుదల చేసింది. ప్రతి నెలా బ్యాంకులకు సెలవులు ఉండే విషయం తెలిసిందే. ఏవైనా ఆర్థిక సంబంధిత పనుల కోసం వెళ్లేవారు ఏయే రోజుల్లో బ్యాంకులు పని చేస్తాయో.. సెలవులుంటాయో తెలుసుకోవడం మంచిది.
Bank Holidays in August | ఆగస్టు మాసంలో 13 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. ఈ మేరకు ఆర్బీఐ బ్యాంకుల సెలవులకు సంబంధించిన జాబితాను విడుదల చేసింది. ప్రతి నెలా బ్యాంకులకు సెలవులు ఉండే విషయం తెలిసిందే. ఏవైనా ఆర్థిక సంబంధిత పనుల కోసం వెళ్లేవారు ఏయే రోజుల్లో బ్యాంకులు పని చేస్తాయో.. సెలవులుంటాయో తెలుసుకోవడం మంచిది. సాధారణ సెలవులతో పాటు పండుగ సెలవులు కలుపుకొని పది రోజులు సెలవులు ఉండనున్నాయి. అయితే, బ్యాంకులు మూసి ఉన్నా మొబైల్, ఇంటర్‌నెట్ బ్యాంకింగ్, యూపీఐ సర్వీసులు నిరంతరాయంగా పని చేయనున్నాయి. డబ్బులు చేసుకునేందుకు అవకాశం ఉన్నది. నగదు ఉపసంహరణకు ఏటీఎంలు అందుబాటులో ఉన్నాయి. అలాగే పలు బ్యాంకులు క్యాష్ డిపాజిట్ కోసం మెషిన్స్‌ను సైతం అందుబాటులోకి తీసుకువచ్చాయి. వీటితో వీటితో అకౌంట్లలో డబ్బులు చేసుకునే వీలున్నది. కొన్ని సేవల కోసం బ్యాంకులకు వెళ్లే అవసరం ఉంటుంది. అలాంటి సమాచారం సెలవుల గురించి సమాచారం ఉంటే.. ఇబ్బందులు లేకుండా ముందస్తుగానే పనులు చేసుకునే అవకాశం ఉంటుంది.
ఆగస్టు 2024లో బ్యాంకుల శాఖలకు సెలవులు..
3న కెర్ పూజ సందర్భంగా త్రిపురలో బ్యాంకులకు సెలవు.
8న టెండాంగ్‌లో లో రమ్ ఫాత్ సందర్భంగా సిక్కింలో బ్యాంకులకు హాలీడే.
3న ప్యాట్రియట్ డే కారణంగా మణిపూర్‌లో బ్యాంకుల సెలవు.
4న ఆదివారం దేశవ్యాప్తంగా బ్యాంకుల మూసివేత.
10న రెండో శనివారం సందర్భంగా హాలీడే.
11న ఆదివారం సెలవు.
15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సెలవు.
18న ఆదివారం సెలవు.
19న రక్షా బంధన్, ఝులానా పౌర్ణమి, బిర్ బిక్రమ్ కిశోర్ మానిక్యా బహదూర్ జయంతి సందర్భంగా త్రిపుర, గుజరాత్, ఒడిశా, ఉత్తరాఖండ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్‌లలో బ్యాంకులకు సెలవులు
20న నారాయణ గురు జయంతి సందర్భంగాల కేరళలో హాలీడే.
24న నాలుగో శనివారం సందర్భంగా మూసివేత.
25న ఆదివారం కావడంతో మూసివేత
26న శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా పలు రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు
31న ఆదివారం సందర్భంగా బ్యాంకుల మూసివేత.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram