విధాత: తెలుగు సినీ రంగంలో అచ్చమైన తెలుగు అమ్మాయిలకు అవకాశాలు రావడం అరుదు. ఏదో చిన్నా చితక పాత్రలు వస్తాయి. మనవారు ఎంతగా అందంగా ఉన్నా, నటనా ప్రతిభ ఉన్నా, బాలీవుడ్ బ్యూటీలతో సరి సమానంగా స్కిన్ షో చేయడానికి రెడీగా ఉన్నా కూడా వారిని ఎందుకో మన మేకర్స్ గానీ, హీరోలు గానీ పట్టించుకోరు.
విషయంలోకి వస్తే.. ఈ లక్షణాలన్నీ ఉన్న అసలు సిసలు తెలుగమ్మాయి శోభిత ధూళిపాళ. ఈమె తెనాలికి చెందిన అమ్మాయి. నటిగా, మోడల్‌గా కొనసాగుతోంది. 2012లో ఈమె మోడలింగ్ రంగంలోకి ప్రవేశించింది. 2013లో జరిగిన మిస్ ఎర్త్ ఇండియా అందాల పోటీల్లో భారతదేశం తరఫున పాల్గొని 2013లో మిస్ ఇండియా అందాల పోటీలలో రెండో స్థానం సొంతం చేసుకుంది. ఈమె 2016లో అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించిన రామన్ రాఘవన్ 2.0 చిత్రంతో నటిగా పరిచయమైంది.
అడివి శేష్ హీరోగా మహేష్ బాబు నిర్మించిన ‘మేజర్’ సినిమాలో కీలక పాత్రను పోషించింది. అంతకు ముందు అడవి శేష్ హీరో గానే నటించిన ‘గూఢచారి’ చిత్రంలో కూడా నటించింది. ఈమె బాలీవుడ్‌లో రామన్ రాఘవన్ 2.0 తో పాటు చెఫ్, కళా కంది, ముతోన్, ది బాడీ, ఘోస్ట్ స్టోరీస్, సితార వంటి చిత్రాలు చేసింది. వీటిలో పలు చిత్రాలు ద్విభాషా చిత్రాలు కావడం విశేషం. ఈమె నటించిన మూతోన్ చిత్రం మలయాళంలో కూడా విడుదలైంది. ఇటీవల మణిరత్నం దర్శకత్వం వహించిన పొన్నియన్ సెల్వన్ 1 చిత్రంలో నటించి మంచి పేరు తెచ్చుకుంది.
మలయాళంలో దుల్హర్ సల్మాన్‌తో ‘కురుప్’ అనే సినిమాలో నటించింది. ఇంగ్లీష్‌లో మంకీ మ్యాన్‌లో నటించింది. ఇక విషయానికి వస్తే అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య తన భార్య సమంతకు విడాకులు ఇచ్చిన తర్వాత ఎక్కువగా మీడియాకు కనిపించడం లేదు. ఏదో సినిమా ప్రమోషన్స్‌లో మాత్రమే తళుక్కుమంటున్నాడు. మిగతా సమయాల్లో ఆయన ఎక్కడ ఉంటున్నాడు? ఏం చేస్తున్నాడు? అనేది ఎవరికీ తెలియడం లేదు. తాజాగా చైతు.. శోభిత ధూళిపాళతో డేటింగ్ చేస్తున్నాడనే వార్తలు ఫిలిం సర్కిల్స్‌లో బాగా వినిపిస్తున్నాయి.
శోభితతో నాగచైతన్య చాలా క్లోజ్‌గా మూవ్ అవుతున్నాడని, ఆమెతో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నాడని వార్తలు వస్తున్నాయి. కానీ వీటిపై వారిద్దరూ మౌనంగానే ఉంటున్నారు. ఇటీవల ఫారిన్ వెకేషన్‌లో శోభితతో కలిసి చైతు కనిపించడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. అయితే ఈ వార్తలపై శోభిత ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు.
అసలు ఆ టాపిక్ ను ప్రస్తావించేందుకు ఆమె ఆసక్తి చూపించడం లేదు. నేను నా కెరీర్ పైనే ఫోకస్ పెట్టాను. ఇప్పట్లో ఎలాంటి రిలేషన్‌లోకి వెళ్లేందుకు సిద్ధంగా లేనని సన్నిహితుల వద్ద చెప్పుకొస్తుందట. దీంతో.. నాగచైతన్య రిలేషన్ గురించి ఆమె ఇప్పటిలో కామెంట్ చేయకపోవచ్చని అర్థమవుతుంది. మరి ఈ విషయమై అక్కినేని నాగచైతన్య అయినా ఏమైనా స్పందిస్తాడా లేదా అనేది వేచి చూడాలి.