High Court: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు హైకోర్టులో ఊరట దక్కింది. ఉట్నూరు పీఎస్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను హైకోర్టు కొట్టేవేసింది.
కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన మూసీ ప్రక్షాళనలో లక్షా 50 వేల కోట్ల స్కామ్ ఉందని.. అందులో పాతిక వేల కోట్లు ఢిల్లీకి పంపుతున్నారని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకురాలు ఆత్రం సుగుణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆత్రం సుగుణ ఫిర్యాదు మేరకు ఊట్నూరు పోలీసులు గత ఏడాది సెప్టెంబర్ 30న కేటీఆర్ పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో ఇరువర్గాల వాదనలు విన్న తర్వాత కేటీఆర్ పై నమోదైన ఎఫ్ఐఆర్ ను కొట్టేస్తూ జస్టిస్ కే.లక్ష్మణ్ ఉత్తర్వులు జారీ చేశారు.