1300 Years Ago | 1300 ఏళ్ల క్రితం చ‌నిపోయిన యువ‌తి ఎంత అందంగా ఉందో తెలుసా..?

1300 Years Ago విధాత‌: యూకే శాస్త్రవేత్త‌లు అద్భుతం చేశారు. 1300 ఏళ్ల క్రితం మ‌ర‌ణించిన ఓ 16 ఏళ్ల బాలిక మోమును పునఃసృష్టించారు. యూకేలోని కేంబ్రిడ్జ్‌ష‌య‌ర్‌లో ఈ బాలిక అవ‌శేషాల‌ను ఏడాది క్రితం ప‌రిశోధ‌కులు క‌నుగొన్నారు. ఆ ఎముక‌ల‌ను, పూడ్చిపెట్టిన విధానాన్ని ప‌రిశీలించ‌గా ఆమె 16 ఏళ్ల ఆంగ్లో యాక్స‌న్ జాతికి చెందిన దానిగా గుర్తించారు. అప్ప‌టి అమ్మాయిలు ఎలా ఉండేవారు, వారి ముఖ క‌వ‌ళిక‌లు ఏమిటి అనే అంశాలు అంచ‌నా వేయ‌డానికి ఆమె స్క‌ల్‌ను […]

  • Publish Date - June 20, 2023 / 08:38 AM IST

1300 Years Ago

విధాత‌: యూకే శాస్త్రవేత్త‌లు అద్భుతం చేశారు. 1300 ఏళ్ల క్రితం మ‌ర‌ణించిన ఓ 16 ఏళ్ల బాలిక మోమును పునఃసృష్టించారు. యూకేలోని కేంబ్రిడ్జ్‌ష‌య‌ర్‌లో ఈ బాలిక అవ‌శేషాల‌ను ఏడాది క్రితం ప‌రిశోధ‌కులు క‌నుగొన్నారు. ఆ ఎముక‌ల‌ను, పూడ్చిపెట్టిన విధానాన్ని ప‌రిశీలించ‌గా ఆమె 16 ఏళ్ల ఆంగ్లో యాక్స‌న్ జాతికి చెందిన దానిగా గుర్తించారు.

అప్ప‌టి అమ్మాయిలు ఎలా ఉండేవారు, వారి ముఖ క‌వ‌ళిక‌లు ఏమిటి అనే అంశాలు అంచ‌నా వేయ‌డానికి ఆమె స్క‌ల్‌ను పునఃనిర్మించాల‌ని ప‌రిశోధ‌కులు భావించారు. సంవ‌త్స‌రం పాటు రోజూ 18 గంట‌ల‌కు పైగా క‌ష్ట‌ప‌డి ఫ‌లితాల్ని సాధించ‌గ‌లిగారు. ఆ పుర్రెకు సంబంధించిన కొల‌త‌ల‌ను తీసుకుని సిమ్యులేష‌న్‌లో అమ్మాయి చిత్రాన్ని గీస్తూ వ‌చ్చారు. మొత్తం గీశాక చూస్తే అంద‌మైన అమ్మాయి మోము వారి ముందుకు వ‌చ్చింది.

అయితే త‌న డీఎన్‌ఏ అందుబాటులో లేక‌పోవ‌డంతో జుట్టు రంగును శాస్త్రవేత్త‌లు అంచ‌నా వేయ‌లేక‌పోయారు. తెల్ల‌టి మేని ఛాయ‌, కుదురైన గ‌డ్డం ఆమె సొంత‌మ‌ని ప‌రిశోధకులు పేర్కొన్నారు. విచిత్రంగా ఆమె ఎడ‌మ క‌న్ను కుడి క‌న్ను కంటే అర సెం.మీ. కింద‌కు ఉండ‌టం విశేషం.

ఈ అమ్మాయి శ‌వంపై బంగారు శిలువ‌ను ఉంచి పూడ్చిపెట్టారు. దీన్ని బ‌ట్టి చూస్తే.. జ‌ర్మ‌నీ నుంచి ఇంగ్లండ్‌కు క్రైస్త‌వాన్ని ప్ర‌చారం చేయ‌డానికి వ‌చ్చిన తొలి త‌రం వ‌ల‌స‌దారు కుటుంబానికి చెందిన అమ్మాయిగా క‌నిపిస్తోంది. అయితే ఇంత అంద‌మైన అమ్మాయి 16 ఏళ్ల వ‌య‌సులోనే ఎందుకు చ‌నిపోయింద‌న్న విష‌యం శాస్త్రవేత్త‌ల‌కు అంతుబ‌ట్ట‌డం లేదు.

అమ్మాయి అవ‌శేషాల‌ను విశ్లేషించ‌గా ఇంగ్లండ్ వ‌చ్చాక ఆమె ప్రొటీన్ లోపంతో బాధ‌ప‌డింద‌ని తెలిసింది. ఇది నేరుగా త‌న చావుకు కార‌ణ‌మ‌ని శాస్త్రవేత్త‌లు చెప్ప‌లేక‌పోతున్నారు. 1300 ఏళ్ల ఆ అమ్మాయి ఫొటోను జూన్ 21 నుంచి ప్రారంభం కానున్న కేంబ్రిడ్జ్ మ్యూజియం ఆఫ్ ఆర్కియాలజీ, ఆంథ్రోపాల‌జీ ఎగ్జిబిష‌న్ లో ప్ర‌ద‌ర్శించ‌నున్నారు.

ఫేషియ‌ల్ రీక‌న‌స్ట్ర‌క్ష‌న్ అనేది ఇప్పుడు అభివృద్ధి చెందిన ఒక అత్యాధునిక విధానం. దీని ద్వారా శతాబ్దాల క్రితం మ‌ర‌ణించిన వారి మొహాల‌ను తిరిగి మ‌నం సృష్టించ‌వ‌చ్చు.

Latest News