Somesh Kumar | సీఎం ప్రధాన స‌ల‌హాదారునిగా సోమేశ్ కుమార్ బాధ్య‌త‌లు

విధాత‌: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాన సలహాదారుగా సోమేష్ కుమార్ (Somesh Kumar) శుక్రవారం ఉదయం సచివాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు. ప్రధాన సలహాదారుగా 6వ అంతస్తులో కేటాయించిన ఛాంబర్లో అర్చకులు పూజలు నిర్వహించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం సోమేష్ కుమార్‌కు సచివాలయంలోని అధికారులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. తనపై విశ్వాసం ఉంచి రాష్ట్రానికి సేవ చేసే అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రికి సోమేష్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ సీఎస్‌గా ఎక్కువ కాలం పని చేసిన సోమేశ్‌ కుమార్‌ను […]

  • Publish Date - May 12, 2023 / 06:45 AM IST

విధాత‌: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాన సలహాదారుగా సోమేష్ కుమార్ (Somesh Kumar) శుక్రవారం ఉదయం సచివాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు. ప్రధాన సలహాదారుగా 6వ అంతస్తులో కేటాయించిన ఛాంబర్లో అర్చకులు పూజలు నిర్వహించారు.

బాధ్యతలు స్వీకరించిన అనంతరం సోమేష్ కుమార్‌కు సచివాలయంలోని అధికారులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. తనపై విశ్వాసం ఉంచి రాష్ట్రానికి సేవ చేసే అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రికి సోమేష్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు.

తెలంగాణ సీఎస్‌గా ఎక్కువ కాలం పని చేసిన సోమేశ్‌ కుమార్‌ను వాస్తవంగా రాష్ట్ర విభజనలో ఏపీ కేడర్‌కు కేటాయించారు. అయితే ఆయన ఏపీకి వెళ్లకుండా ఇక్కడే ఉన్నాడు. సోమేశ్‌తో ఏపీకి కేటాంచబడిన మరి కొంత మంది అధికారులపై వివాదం నడిచింది. సోమేశ్‌ కేసును విచారించిన హైకోర్టు చివరకు సోమేశ్‌ కుమార్‌ ఏపీకి వెళ్లాల్సిందేనని తీర్పు ఇచ్చింది. దీంతో తప్పని సరి పరిస్థితిలో ఏపీకి వెళ్లిన సోమేశ్‌ స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అత్యంత నమ్మకస్తుడిగా ఉన్న సోమేశ్‌ కుమార్‌ను సీఎం మహారాష్ట్రలో జరిగిన బీఆర్‌ఎస్‌ బహిరంగ సభకు వెళ్లారు. బీఆర్‌ఎస్‌ అధినేతతో సన్నిహితంగా ఉంటూ వచ్చిన మాజీ సీఎస్‌ను సీఎం కేసీఆర్‌ తన ప్రధాన సలహదారుడిగా నియమించుకోవడం గమనార్హం.