కొడంగ‌ల్‌లో రేవంత్‌రెడ్డి విజ‌యం

కొడంగ‌ల్‌లో పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి స‌మీప ప్ర‌త్య‌ర్థి బీఆరెస్ ఎమ్మెల్యే ప‌ట్నం న‌రేంద‌ర్‌రెడ్డిపై 32,800 ఓట్ల‌తో విజ‌యం సాధించారు

  • Publish Date - December 3, 2023 / 09:34 AM IST

విధాత‌: కొడంగ‌ల్‌లో పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి స‌మీప ప్ర‌త్య‌ర్థి బీఆరెస్ ఎమ్మెల్యే ప‌ట్నం న‌రేంద‌ర్‌రెడ్డిపై 32,800 ఓట్ల‌తో విజ‌యం సాధించారు. అలాగే కామారెడ్డిలో కూడా సీఎం కేసీఆర్‌పై రేవంత్‌రెడ్డి విజ‌యం దిశ‌గా దూసుకు పోతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తున్న నేప‌ధ్యంలో కాంగ్రెస్ పార్టీ కార్య‌క‌ర్తుల పెద్ద ఎత్తున గాంధీభ‌వ‌న్‌లో సంబురాలు చేసుకుంటున్నారు.


ఈ విజ‌యంపై రేవంత్ స్పందిస్తూ.. ఆత్మగౌరవ జెండాను ఆకాశమంత ఎత్తున ఎగరేసిన కొడంగల్ గడ్డకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. కొన ఊపిరి వరకు కొడంగలే శ్వాసగా జీవిస్తా. కష్టకాలంలో భుజాలు కాయలు కాసేలా కాంగ్రెస్ జెండాను మోసిన ప్రతి కార్యకర్తను కడుపులో పెట్టుకుని చూసుకుంటా. ఈ గడ్డ పై ప్రతి బిడ్డ బతుకులో వెలుగు నింపే.. అంటూ ట్విట్ చేశారు.